
రాజమండ్రి :
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి ఎస్‌వీజీ మార్కెట్ వద్ద జరిగింది. మోరంపూడి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని ఎస్‌వీజీ మార్కెట్ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి గురైన కారు రాజమండ్రి విజిలెన్స్ డీఎస్పీకి చెందినదిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment