కారు బోల్తాపడి ఇద్దరు మృతిచెందారు.
పూడూరు(రంగారెడ్డి): వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చిలాపూర్ గ్రామ శివారులోని కేశవరెడ్డి పాఠశాల సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు గుల్‌బర్గా నుంచి ఫార్చ్‌నర్ వాహనంలో నగరానికి వస్తుండగా.. కేశవరెడ్డి పాఠశాల సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వాహనంలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.