దివ్యాంగులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
సాక్షి, రాజమహేంద్రవరం : అబద్దపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరికి తమకు కూడా అన్యాయం చేశారని దివ్యాంగులు వాపోతున్నారు. మంగళవారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలుసుకున్న కొంతమంది దివ్యాంగులు తమ కష్టాలను ఆయనతో పంచుకున్నారు. సైగలతో వారు పడుతున్న కష్టాలను తెలపడం అక్కడున్న వారిని కలచివేసింది.
తమకు వచ్చే పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు వైఎస్ జగన్ కలిసి తాము ఇప్పుడు బతికి ఉండేందు కారణం వైఎస్‌ఆర్ దయే అని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సువర్ణయగం చూశామని, ఇప్పుడా పరిస్థితి లేదని.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ తరహా పాలన సాధ్యమవుతుందని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి అగ్నికులక్షత్రియులు..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జొన్నలంక వద్ద వైఎస్ జగన్‌ను కలుసుకున్న వంద మంది అగ్నికుల క్షత్రియులు ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. అదే గ్రామంలో ఓ పసిబిడ్డకు రాజశేఖర్ అని నామకరణం చేశారు వైఎస్ జగన్. ఆయన చేత తమ బిడ్డకు పేరు పెట్టించాలని దాదాపు మూడు నెలల నుంచి ఎదురుచూస్తున్నట్లు ఆ బిడ్డ తల్లిదండ్రులు తెలిపారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment