సాక్షి, తూర్పుగోదావరి: ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఆయన గురువారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ.. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించారు. ఇసుక సమస్యను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులకు అవినీతి మకిలి అంటుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని లోక్‌సభలో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తాలని సీఎం జగన్‌కు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. రాజమండ్రి దానవైపేట ప్రకాష్ నగర్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని ‘కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్’ గా వ్యవహరిస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment