
టాలీవుడ్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో ఈ ఘటన జరిగింది. కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా స్వప్న వర్మ పనిచేస్తుంది. టాలీవుడ్‌లో పలు చిన్ని సినిమాలకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ మూడు సంవత్సరాల క్రితం సినీ ఇండస్ట్రీలో నిలబడాలని హైదరాబాద్‌కు వచ్చింది. అయితే, గతేడాది నుంచి మాదాపూర్ కావూరి హిల్స్‌లోని తీగల హౌస్ అపార్ట్‌మెంట్ 101 ఫ్లాట్‌లో ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఆరు నెలలుగా సినిమా పరిశ్రమలో తనకు ఎలాంటి ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండటంతో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం తన ఫ్లాట్‌లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో సమాచారం వెంటనే తెలియలేదు. బాడీ డి కంపోజ్ అవ్వడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment