తల్లి మందలించిందని ఇంటి నుంచి పారిపోయి వచ్చిన విద్యార్థిని రైల్వే పోలీసులు అతడి తండ్రికి అప్పగించిన సంఘటన ఇది.
రైల్వేస్టేషన్ (రాజమండ్రి), న్యూస్‌లైన్ : తల్లి మందలించిందని ఇంటి నుంచి పారిపోయి వచ్చిన విద్యార్థిని రైల్వే పోలీసులు అతడి తండ్రికి అప్పగించిన సంఘటన ఇది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు పట్టణానికి చెందిన తుంపాల అర్జున్ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.
అతడి కుమారుడు గణేష్ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సరిగ్గా చదవడం లేదని అతడి తల్లి మందలించడంతో, కోపగించుకున్న అతడు రెలైక్కి రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.
బుధవారం ఉదయం గోదావరి రైల్వే స్టేషన్‌లో తచ్చాడుతున్న అతడిని హెచ్‌సీ రుద్రబాబు గమనించారు. అతడిని ఆరాతీయడంతో విషయం వెలుగుచూసింది. వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఏలూరు నుంచి రాజమండ్రి వచ్చిన తండ్రి అర్జున్‌కు జీఆర్పీ ఎస్సై చలపతి రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో గణేష్‌ను అప్పగించారు.