క్లాత్‌నూ కొల్లగొట్టారు
Published Mon, Feb 17 2014 2:11 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్కారు ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్ క్లాత్‌నూ అక్రమార్కులు వదల్లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు తరలించి.. తక్కువ ధరకు కుట్టించి ప్రభుత్వం విడుదల చేసే సొమ్మును స్వాహా చేసేందుకు.. కొంత క్లాత్‌ను రాజమండ్రిలో అమ్మి సొమ్ము చేసుకునేందుకు పన్నిన పన్నాగం విజిలెన్స్ విభాగం తనిఖీలో బట్టబయలైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు కేటాయించిన యూనిఫామ్ క్లాత్‌ను అక్రమంగా రాజమండ్రి, విశాఖపట్నంలకు తరలిస్తుండగా శనివారం రాత్రి జిల్లా విజిలెన్స్ అధికారులు జీలుగుమిల్లి చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్నారు.
ఈ క్లాత్ విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, దార్డు, కొత్తకోట, మాలదాక్ మండలాల్లోని విద్యార్థులకు రాజీవ్ విద్యామిషన్ ద్వారా యూనిఫామ్స్‌ను కుట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం క్లాత్‌ను సరఫరా చేసింది. ఒక్కో జతకు ప్రభుత్వం రూ.40 చొప్పున ఆ మండలాల ఎంఈవోలకు నగదు చెల్లిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ దుస్తులను ఆ జిల్లాలోని టైలర్స్‌తో కాని, డ్వాక్రా మహిళలతో కాని కుట్టించాలి. అయితే ఈ నాలుగు మండలాల్లోని ఎమ్‌ఈవోలు ఒక్కో జతకు రూ. 15 ఇచ్చి విద్యార్థులకు దుస్తులు కుట్టించి అప్పగించేటట్టు అదే జిల్లాకు చెందిన జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. శనివారం ఎపీ22 టీఎ 5688, ఏపీ 2 టీడీ 3699 నంబర్ల రెండు లారీల్లో 94 వేల మీటర్ల
Advertisement