గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య | student suicid in welfare school at eluru | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

Published Wed, Feb 25 2015 10:59 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

ఏలూరు క్రైమ్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దెందులూరు మండలం, రామారావుగూడెంకు చెందిన కత్తె రచన(15) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి తరగతి గదిలో చున్నీతో ఉరివేసుకోగా... బుధవారం ఉదయం వాచ్‌మ్యాన్ చూసి ప్రిన్సిపల్ కు  సమాచారం అందించాడు. 

దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రచన ఆత్మహత్యతో తల్లిదండ్రులు,  గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement