రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేయడంతో చాలామంది రోడ్డున పడ్డారు. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి తమ నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని ఆ సంస్థ మోసం చేసిందని వారు ఆరోపించారు. ఆ సంస్థను ఒక యాడ్ ద్వారా సుమతో పాటు ఆమె భర్త, రాజీవ్ కనకాల ప్రమోట్ చేయడంతో తామందరం పెట్టుబడి పెట్టామని వారు తెలిపారు. దీంతో సుమ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా యాంకర్ సుమ సోషల్‌మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.
'రాకీ అవెన్యూస్‌కు సంబంధించిన ఒక యాడ్‌లో నేను గతంలో నటించాను. నా వృత్తిలో భాగంగా 2016-2018 వరకు మాత్రమే వారితో ఒప్పందం ఉంది. ఆపై ఆ ప్రకటనలు రద్దు చేయబడ్డాయి. ఈ ప్రకటనలు ఇప్పుడు అనధికారమైనవి అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. పైన పేర్కొన్న వ్యవధి తర్వాత నేను ఏ సందర్భంలోనూ రాకీ అవెన్యూస్‌కు సంబంధించిన యాడ్‌లో కనిపించలేదు. అయితే, కొంత కాలం తర్వాత పాత ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది.
ఇటీవలి కాలంలో నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుంచి కొన్ని లీగల్ నోటీసులను అందుకున్నాను. ఆపై వారి నోటీసులకు నేను సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో రాకీ అవెన్యూలకు పంపిన లీగల్ నోటీసులో కొనుగోలుదారుల జాబితాను కూడా పరిశీలించమని వారిని కోరాను. నేను కూడా ఈ సమస్యను పరిష్కరించేందకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. తప్పుడు సమాచారాన్ని అరికట్టండి. అధికారిక ఛానెల్‌ల నుంచి వచ్చే ఏదైనా ప్రకటనలు, ప్రమోషన్‌లు, వీడియోలను ధృవీకరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలని నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.' అని సుమ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment