అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ విజయం సాధిండం తన ఘనతేనని పొరబాటున చెప్పుకుంటారామో, అది మనదేశం కాదు బాబు’ అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. గురువారం ఇక్కడ
-
చంద్రబాబును ఎద్దేవా చేసిన జక్కంపూడి
తూర్పుగానుగూడెం (రాజానగరం) :
అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ విజయం సాధిండం తన ఘనతేనని పొరబాటున చెప్పుకుంటారామో, అది మనదేశం కాదు బాబు’ అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీ రామారావును రాజకీయాల్లోకి తీసుకురావడంలోను, హైదరాబాద్‌ని అభివృద్ది చేయడంలోనే కాకుండా ఇటీవల ఒలింపిక్స్‌లో మన దేశానికి సిల్వర్ పతకాన్ని సాధించిన పీవీ సింధు విజయంలోను తన ప్రమేయం ఉందంటూ ప్రచారం చేసుకున్న ఆయన అలవాటు ప్రకారం ట్రంప్ విజయాన్ని కూడా తన ఘనతగానే చెప్పుకోవచ్చన్నారు. అటువంటి అలవాటులో పొరబాటు జరుగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనను ఈ విధంగా అప్రమత్తం చేస్తున్నానన్నారు.
సంస్కృతిని కాపాడండి
భారతీయ పౌరుడిగా మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జక్కంపూడి రాజా అన్నారు. విశాఖ బీచ్‌లో నిర్వహించనున్న లవ్ ఫెస్టివల్ విషయంలో ప్రజలంతా వద్దని వారిస్తూ ఆందోళనలు నిర్వహిస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం తాను చెప్పిందే శాసనం అన్నట్టుగా బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామనడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. చరిత్రలో నియంతల పరిస్థితి ఎలా ముగిసిందో ఒకసారి మననం చేసుకోవాలని హితవు పలికారు.
వాస్తవాలను గ్రహించాలి
ప్రజా çసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తమ నాయకుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై మీ మంత్రులతో విమర్శల దాడి చేయించడం మానుకుని వాస్తవాలను గ్రహించాలని, లేకుంటే భవిషత్తులో మిమ్మల్ని, మీ పార్టీని కాపాడటానికి ఏ పవనిజం, ప్రజావ్యతిరేకత ముందు నిలబడదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది సామాన్యులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, అన్నింటినీ పచ్చచొక్కాలే ఎగరేసుకుపోతున్నాయన్నారు. అ««ధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా పేదవారి సొంతింటి కలను సాకారం చేయలేకపోయారన్నారు. సంజీవని వంటి 108, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అసంపూర్తిగా నడుస్తున్నాయన్నారు. సమావేశంలో మండల కన్వీనర్ మందారపు వీర్‌ారజు, ఉపసర్పంచ్ చొల్లంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.