ముమ్మిడివరం : బాబు వస్తే జాబు వస్తుంది..అంటూ ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి యువత ఓట్లు కొల్లగొట్టి ఇప్పుడు ఉన్న జాబులు పీకేసీ వారిని రోడ్డున పడేయడం న్యాయమా చంద్రబాబూ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడిరాజా ప్రశ్నించారు. ముమ్మిడివరంలో ఉపాధి హమీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్లు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఆరోగ్యమిత్ర, ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు వివిధ శాఖ లలో చాలీచాలని వేతనాలతో పనిచేసే వారిని తొలగించి జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కాలకు అప్పగించే ప్రయత్రం చేస్తున్నారని విమర్శించారు. కోర్డు ఉత్తర్వుల మేరకు జిల్లావ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోగా ఈ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం తగదన్నారు. ఈ సమస్యను పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారికి హమీ ఇచ్చారు. అసెంబ్లీలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విధంగా తమ పార్టీ అధికారంలోకి రాగానే ఫీల్డ్‌అసిస్టెంట్లతో పాటు కాంట్రాక్టర్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
రాజాకు ఘనస్వాగతం : పదవి చేపట్టి తొలిసారి ముమ్మిడివరం వచ్చిన రాజాకు ఘన స్వాగం లభించింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, పెన్మత్స చిట్టిరాజు, జగతా పద్మనాభం(బాబ్జీ) నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ కాశి బాలమునికుమారి, పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలువేసి స్వాగతం పలికారు. పోలమ్మ చెరువు వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి శిలా విగ్రహానికి రాజా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వీరి వెంట రాజమహేంద్రవరం కౌన్సిలర్ బొంతా శ్రీహరి, కోడి కోటయ్య, వీరబాబు ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్న జాబులు పీకేస్తావా చంద్రబాబూ?
Published Tue, Jun 7 2016 1:14 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM
Advertisement
Advertisement