
సాక్షి, తూర్పుగోదావరి : రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి చాపర్‌లో కొమరగిరికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, జక్కంపూడి విజయలక్ష్మీ, ఆకుల సత్యనారాయణ, చందన నాగేశ్వర్ రావు ఉన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి బాకరాపురం హెలిప్యాడ్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయల్దేరి వెళ్లారు. చదవండి: పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్