Rajahmundry Airport
-
రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లైసెన్సుడ్ గన్ బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని చెప్పారు. ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ప్రయాణికుడు సుబ్బరాజును కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన
-
సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పుగోదావరి : రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి చాపర్‌లో కొమరగిరికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, జక్కంపూడి విజయలక్ష్మీ, ఆకుల సత్యనారాయణ, చందన నాగేశ్వర్ రావు ఉన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి బాకరాపురం హెలిప్యాడ్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయల్దేరి వెళ్లారు. చదవండి: పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్ -
రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ప్రియాంకల విహహానికి హాజరుకారనున్నారు. అలాగే ఇటీవల వివాహమైన కాకినాడ రూరల్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు కుమారుడు నరేష్, కోడలు స్రవంతిలను వైఎస్ జగన్ ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడ నుంచి రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని... అనంతరం మధురపూడి విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. -
గన్నవరం ఎయిర్పోర్ట్ కంటే బెజవాడ బస్టాండే ...
విజయవాడ : గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఆయన గురువారం గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ శంషాబాద్ ఎయిర్పోర్టులాగానే గన్నవరం ఎయిర్‌పోర్టును కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం భూమిని సేకరించే పని రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. గన్నవరం విమానాశ్రయం కంటే విజయవాడ బస్టాండే పెద్దదిగా ఉందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సౌకర్యాలు అంతగా లేవని ఆయన అన్నారు. అనంతరం అశోక్ గజపతిరాజు ...గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణపై సదరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. -
కలెక్టర్‌గారూ!ఈ తేడాలేమిటి?
సాక్షి, రాజమండ్రి :దాదాపు ఐదేళ్లుగా నలుగుతున్న రాజమండ్రి విమానాశ్రయ భూ సేరకణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పుష్కరాల నాటికి విమానాశ్రయ విస్తరణ పూర్తి చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదివారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మధురపూడి, బూరుగుపూడి రైతులతో సమావేశమయ్యారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం తమకు నష్టం కలిగేలా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధురపూడి, బూరుగుపూడి పక్కపక్కనే ఉన్నా మధురపూడిలో ఎకరం ధర రూ.31 లక్షలని అంచనా వేసిన అధికారులు, బూరుగుపూడికి వచ్చేసరికి రూ.17 లక్షలు మాత్రమే విలువ కట్టడమేమిటని నిలదీశారు. వాస్తవానికి ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎకరం విలువ రూ.కోటిన్నర దాటగా లెక్కకట్టిన పరిహారంలోనూ ఇంత తేడాలమిటని ప్రశ్నించారు. మార్కెట్ రేటు చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారంలో మరో సమావేశం.. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రెండు గ్రామాల్లో పర్యటించి వారంలో మరోసారి రైతులతో సమావేశం అవుతారని కలెక్టర్ వివరించారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మేలు జరుగుతుందని. రైతుల పంటల ఫలసాయాలకు కూడా పూర్తిగా నష్ట పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. పుష్కరాల నాటికి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సదుపాయం, రన్‌వే కూడా విస్తరణ చేయాల్సి ఉందన్నారు. విమానాశ్రయ అధికారులు కోరిన 840 ఎకరాల సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో భాగంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విమానాశ్రయం డెరైక్టర్ ధనుంజయ, రెవెన్యూ, సర్వే అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సేకరించే భూములు, వాటి సర్వే నెంబర్లు, విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకూ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడం తదితర అంశాలపై చర్చించారు. సర్కారు ధరకు భూములివ్వం.. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న భూములు ప్రస్తుతం ఎకరం రూ.కోటిన్నర పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మధురపూడి భూములకు రూ.31 లక్షలు, బూరుగుపూడి గ్రామంలోని భూములకు రూ.17 లక్షల రేటు కట్టడం దారుణం. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం మా భూములకు విలువ నిర్ణయించి చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధం. - కంటే సత్తిబాబు, బూరుగుపూడి మాజీ సర్పంచ్ ఎనిమిదేళ్లుగా రాబడి లేదు.. గత ఎనిమిదేళ్లుగా భూమిపై ఆదాయం రావడం లేదు. భూములు స్వాధీనం చేసుకుంటామంటున్నా న్యాయమైన రేటు చెల్లించడం లేదు. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ చెల్లిస్తున్నారు. పొలంలో ఉన్న చెట్లకు ఎంత చెల్లిస్తారో తెలియదు. ఎయిర్ పోర్టు విస్తరణకు తీసుకున్న భూములకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాలి. లేకుంటే స్వాధీనం చేయం - సూర్యనారాయణ, రైతు, బూరుగుపూడి