రాజమండ్రి చేరుకున్న వైఎస్ జగన్
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ప్రియాంకల విహహానికి హాజరుకారనున్నారు.
అలాగే ఇటీవల వివాహమైన కాకినాడ రూరల్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు కుమారుడు నరేష్, కోడలు స్రవంతిలను వైఎస్ జగన్ ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడ నుంచి రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని... అనంతరం మధురపూడి విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.