గన్నవరం ఎయిర్పోర్ట్ కంటే బెజవాడ బస్టాండే ...
విజయవాడ : గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఆయన గురువారం గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ శంషాబాద్ ఎయిర్పోర్టులాగానే గన్నవరం ఎయిర్పోర్టును కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఎయిర్పోర్టు విస్తరణ కోసం భూమిని సేకరించే పని రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.
గన్నవరం విమానాశ్రయం కంటే విజయవాడ బస్టాండే పెద్దదిగా ఉందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. గన్నవరం ఎయిర్పోర్టులో సౌకర్యాలు అంతగా లేవని ఆయన అన్నారు. అనంతరం అశోక్ గజపతిరాజు ...గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణపై సదరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.