
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నీ రాజకీయ సినిమా అయిపోయింది. ఇక అసలు సినిమాలు చేసుకో. ఆ సినిమాలను చూసి మేము ఆనందిస్తాం. తమ డిమాండ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్డెక్కిన కాపులను అక్రమంగా పోలీసు కేసుల్లో ఇరికించినప్పుడు ఎక్కడున్నావు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయావు?’ అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్ అయ్యారు. రాజమహేంద్రవరంలో ఆదివారం రాజా విలేకరులతో మాట్లాడుతూ..
► అటు సొంత పార్టీ అధ్యక్షుడిగా, ఇటు చంద్రబాబు మనిషిగా రెండు పడవలపై కాలు వేసి ఇంకా ఎంత కాలం పవన్ ప్రయాణిస్తారు?
► గత ఎన్నికల్లో రాష్ట్రంలోని కాపులు పవన్‌కు, జనసేన పార్టీకి గుణపాఠం చెప్పినా ఆయన బుద్ధి మారలేదు.
► అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాపులను పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వానికి తాళం వేస్తూ కాపు నేతగా పవన్ కూడా కాపులకు న్యాయం చేసే దిశగా మాట్లాడలేదు. నాడు కాపులు రోడ్డెక్కినప్పుడు వారితో కలిసి పోరాడలేదు.
► ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో కాపులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ, తొలి ఏడాది బడ్డెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించి, కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల లోపు కాపు మహిళలను ఆదుకుంటూంటే.. కాపులపై మొసలి కన్నీరు కారుస్తూ అవాస్తవాలతో ఆరోపణలు చేయడం తగునా?
► చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కాపులకు రూ.5 వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, కేవలం రూ.1,600 కోట్లే కేటాయించినప్పుడు పవన్‌కు కాపులు గుర్తుకు రాలేదా?
Comments
Please login to add a commentAdd a comment