జగన్ పాలన కోసం జనం ఎదురుచూపు | People wait for YS Jaganmohan Reddy administration | Sakshi
Sakshi News home page

జగన్ పాలన కోసం జనం ఎదురుచూపు

Published Sat, Dec 14 2013 2:55 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

జగన్ పాలన కోసం జనం ఎదురుచూపు - Sakshi

జగన్ పాలన కోసం జనం ఎదురుచూపు

ఆలమూరు, న్యూస్‌లైన్ :  రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షరాలు కొల్లి నిర్మలకుమారి, పార్టీ కొత్తపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువనేత జక్కంపూడి రాజా అన్నారు. బడుగువానిలంకలో శుక్రవారం జరిగిన ‘గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమంలో వారు ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ ఆధ్యక్షతన జరిగిన సభలో వారు ప్రసంగించారు.

 ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమైక్యత కోసం జగన్‌మోహన్‌రెడ్డి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ పార్టీల కలసి మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలన్నారు. ప్రస్తుత సర్వేల ప్రకారం ఏ పార్టీకీ అందనంత ఎత్తులో వైఎస్సార్‌సీపీ ఉందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, స్టీరింగ్ కమీటీ సభ్యుడు నెక్కంటి వెంకట్రాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement