మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు | 2 Mens Molested On Woman In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు

Published Mon, Sep 27 2021 5:29 PM | Last Updated on Mon, Sep 27 2021 6:29 PM

2 Mens Molested On Woman In Uttar Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: తన ఇంటి పక్కన ఉండే  కొంత మంది వ్యక్తులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని లక్నోకి చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు  చేసింది. కాగా, సెప్టెంబరు 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని  జంకిపురంలో ఉండే మహిళ పట్ల ఆమె ఇంటి పక్కన నివసించే రోహిత్‌ యాదవ్‌, హర్నామ్‌ యాదవ్‌ అనే యువకులు గత కొన్ని రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారు.  

ఈ క్రమంలో బాధిత మహిళ సెప్టెంబరు 25న ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు యువకులు ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా సైగలు చేస్తూ..  బాధిత మహిళపై దాడిచేసి దుస్తులను తీసేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు . దీంతో బాధిత మహిళ ఒక్కసారిగా  షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహయంతో జరిగిన దారుణాన్ని పోలీసులకు ఫోన్‌ చేసి తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కి తరలించినట్లు జంకిపూరం పోలీసు అధికారి కుల్దీప్‌ సింగ్‌ తెలిపారు. కాగా, ప్రస్తుతం తనకు పోలీసు భద్రత కావాలని బాధిత మహిళ పోలీసు అధికారులను కోరినట్లు తెలిపింది. 

చదవండి: చెప్పుల్లో బ్లూటూత్‌ పెట్టుకుని పరీక్షలు.. ధర రూ.6 లక్షలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement