లక్నో: దేశంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు అరికట్టడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి సరైన ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లక్నో లోని బాపు భవన్ లో ఓ ప్రభుత్వ అధికారి కాంట్రాక్ట్ ఉద్యోగిని వేధింపులకు గురి చేసి కటకటాల పాలయ్యాడు. వివరాల ప్రకారం .. నిందితుడు ఇచ్చారాం యాదవ్‌ను మైనారిటీ సంక్షేమ శాఖ సెక్షన్ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు.
2018 నుంచి అక్కడ పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఆ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు. అతని అగాయిత్యాలు భరించలేని ఆమె చివరికి ధైర్యం చేసి, యాదవ్ అకృత్యాలను వీడియోలో చిత్రీకరించింది. అందులో... ఆ మహిళ అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను తనను బలవంతం చేస్తున్నాడు. ఈ ఆధారంతో ఆ మహిళ అక్టోబర్ 29న హుస్సేన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మహిళ పోలీసులకు సాక్ష్యంగా అనేక వీడియోలను సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గతంలో యాదవ్‌కుపై ఫిర్యాదు చేసినా పోలీసుల స్పందించలేదని ఆమె ఆరోపించింది.
చదవండి: 'నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment