Contract Employee
-
జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్ : జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రమబద్దీకరణ (రెగ్యూలరైజ్) ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.విద్య, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసింది. 2016లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవో 16ను సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ జీవోను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా.. సుప్రీం కోర్టు తీర్పుకు, రాజ్యాంగంలోని 14, 16, 21 ఆర్టికల్‌కు ప్రభుత్వ నిర్ణయం విరుద్ధమన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం, క్రమబద్దీకరణ ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.దీంతో పాటు మిగిలిన ఖాళీలను చట్టప్రకారం భర్తీ చేయాలని సర్కార్‌కు ఆదేశించింది. పూర్తి వివరాలను ఆర్డర్ కాపీలో పేర్కొంటోమని వెల్లడించింది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులకు తొలగించొద్దన్న హైకోర్టు.. ఇకముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్టప్రకారం చేయాలని ఆదేశించింది. ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా చేయాలని కోర్టు తీర్పును వెలువరించింది. -
ఏపీ ‘కాంట్రాక్టు’ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చింది. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో చట్ట రూపం సంతరించుకుంది. ఈ చట్టానికి సంబంధించి శుక్రవారం ప్రభుత్వ గజిట్లో ముద్రించింది. దీనిద్వారా 02–06–2014కు ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్థీకరణ జరగనుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.311 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఉద్యోగ సంఘాల హర్షం మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్ వెలుగులు నింపారని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి పేర్కొన్నారు. దసరా సందర్భంగా వేలాదిమంది ఉద్యోగుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, సీఎం ఉద్యోగుల పక్షపాతిగా శాశ్వతంగా నిలిచిపోతారని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేయటంపై ప్రభుత్వ కళాశాలల ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీకి కట్టుబడ్డ సీఎం జగన్, మంత్రివర్గం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ కుమ్మరకుంట సురేష్, కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌రెడ్డి, కోశాధికారి పఠాన్ కరీంఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 3,600 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, 350 మంది కాంట్రాక్టు పాలిటెక్నిక్ లెక్చరర్లు, 600 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మసిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకరబాబు కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర హామీని నెరవేర్చి సీఎం జగన్ వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాలు పంచారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టి.కల్పలత హర్షం వ్యక్తం చేశారు. రెగ్యులరైజ్ అవుతున్న వారిలో దాదాపు 4 వేల మందికి పైగా బోధన రంగంలో సేవలు అందిస్తున్నవారేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ హర్షం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు వేగంగా చర్యలు చేపడుతూ.. గతంలో ఇచి్చన వాటికి అదనంగా కొత్తగా 212 గ్రూప్–2 పోస్టులు మంజూరు చేయడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంతకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే డీఎస్సీతో పాటు, పోలీసు శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని కోరారు. -
TS Election 2023: జమిలి ఎన్నికలొస్తే.. కరీంనగర్ నుంచే పోటీ!: బండి సంజయ్
కరీంనగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కుమ్మక్కయినట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాను పార్లమెంట్ సమావేశాలు, అమెరికా పర్యటనలో ఉండడంతోనే కోర్టుకు హాజరుకాలేకపోయానని తెలిపారు. గురువారం కరీంనగర్‌లోని తన నివాసంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి దీక్ష ను భగ్నం చేసి, కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించారు. రాష్రాన్ని రూ.5.5 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి, కేసీఆర్ చెల్లని రూపాయిలా మారారని ఎద్దేవా చేశారు. ఓవైసీ చెబితేనే సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించారని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో క్లారిటీ ఉందని, ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే కరీంనగర్ అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్లో గంజాయి ఏరు లై పారిస్తూ యువతను చిత్తు చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు గంజాయిని కంట్రోల్ చేయని పక్షంలో తామే యువకులతో దళాలను ఏర్పాటు చేసి కట్టడిచేస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండబోరనే హామీ ఏమైంది? రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండబోరని ప్రకటించిన కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం వేతనాన్ని పెంచుతూ గురువారం ఉతర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆలమూరి విజయభాస్కర్ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆమె నెల జీతం 30వేలు.. 7 లగ్జరీ కార్లు, 30 లక్షల టీవీ ఇంకా..
భోపాల్: హేమా మీనా.. ఈమె ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగి. నెలకు జీతం రూ. 30వేలు. కానీ, మీనా ఆస్తులు చిట్టా చూసి అధికారులు షాకయ్యారు. 7 లగ్జరీ కార్లు, రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్ అత్యాధునిక టీవీ, విలాసవంతమైన భవనాన్ని అధికారులు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు సోదాలు నిర్వహించగా ఆమె ఆస్తుల వివరాలు చూసి నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో హేమపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ఇంజినీర్‌గా హేమా మీనా పనిచేస్తోంది. కాగా, ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు గుర్తించిన లోకాయుక్త అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో భోపాల్‌లోని హేమా మీనా నివాసంలో లోకాయుక్త అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అంతేకాకుండా సుమారు 20 వాహనాలు హేమా మీనా కొనుగోలు చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అందులో ట్రాక్టర్లు, వరి నాట్లు యంత్రాలు, హార్వెస్టర్లు, అనేక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన హేమా మీనా నెల జీతం కేవలం రూ.30 వేలు మాత్రమే. ఆమె జీతంతో పోలిస్తే ఆస్తుల విలువ 232 శాతం ఎక్కువ. సోదాల సందర్బంగా 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్ అత్యాధునిక టీవీని అధికారులు గుర్తించారు. హేమా తన తండ్రి పేరుమీద 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేసి అందులో రూ.కోటి వెచ్చించి విలాసవంతమైన ఇంటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్లు, ఇతర విలువైన వస్తువులు కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని ఆస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: బెంగాల్, తమిళనాడు సర్కార్‌కు బిగ్ షాక్ -
మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..
సాక్షి, గన్నవరం/విజయవాడస్పోర్ట్స్/చిట్టినగర్: విజయవాడ వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలో నివసించే పిళ్లా వెంకటరాజేంద్ర గతంలో సివిల్ సప్లయీస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశాడు. పలు మోసాలకు పాల్పడటంతో ఉద్యోగంలో నుంచి తీసేశారు. జల్సాలకు అలవాటుపడిన అతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరతీశాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసిన సివిల్ సప్లయీస్లోనే డెప్యూటీ కలెక్టర్‌గా నకలీ ఐడీ కార్డు సృష్టించాడు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించాడు. రూ.లక్షల్లో నగదు, ఐఫోన్లు, ఖరీదైన గృహోపకరణాలను సమకూర్చుకున్నాడు. మాయమాటలతో బురిడీ పిళ్లా వెంకటరాజేంద్ర మూడేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తన చేతిలో ఉన్నారని, తన మాట వారి వద్ద వేదవాక్కని నమ్మిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఇప్పించడం చిటికెలో పనంటూ గొప్పలుపోతాడు. ఉద్యోగం కోసం వచ్చిన వారితో ఐ–ఫోన్ కొనిపించుకుంటాడు. ఆ తరువాత నుంచి ఒక్కో విడతలో రూ.2 లక్షల చొప్పున రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడు. ఉద్యోగం, కాంట్రాక్టు రాలేదని నిలదీసిన బాధితులను పోలీసుల పేర్లు చెప్పి బెదిరిస్తాడు. కొంత మంది బాధితులకు పోలీసుల పేరుతో ఫోన్ చేయించి బెదిరించిన ఘటనలూ ఉన్నాయి. అతని చేతిలో మోసపోయిన వారిలో సామాన్య ప్రజలతోపాటు కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారని సమాచారం. చదవండి: (కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు) ఎలా పట్టుబడ్డాడంటే.. గన్నవరం సొసైటీ పేటకు చెందిన యామర్తి అరవింద్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ ఏడాది జూన్‌లో అతనికి పిళ్లా వెంకటరాజేంద్ర పరిచయమయ్యాడు. తాను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పౌర సరఫరాల శాఖలో డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు రాజేంద్ర నమ్మబలికాడు. తమ శాఖలో ఒక టెండర్‌తో పాటు స్టోర్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని అరవింద్‌కు మాయమాటలు చెప్పాడు. వీటి నిమిత్తం ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి అరవింద్ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అనంతరం పలు దఫాలుగా అరవింద్ నుంచి డిపాజిట్లు, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా మరో రూ.5.49 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా అరవింద్‌తో రూ.73 వేల విలువైన ఐఫోన్, రూ.36 వేల విలువైన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయించి రాజేంద్ర తీసుకున్నాడు. అయితే తాను చెల్లించిన డబ్బులకు రాజేంద్ర ఎటువంటి రశీదులూ ఇవ్వకపోవడం, కొన్ని రోజులుగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అరవింద్‌కు అనుమానం వచ్చింది. గతంలో రాజేంద్ర చూపించిన డెప్యూటీ కలెక్టర్ ఐడీ కార్డు ఫొటో ఆధారంగా విజయవాడలోని ఆతని ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ నేపథ్యంలో మరో రూ.1.50 లక్షలు కావాలంటూ ఫోన్‌చేసిన రాజేంద్రను నమ్మకంగా గన్నవరం పిలిపించి పోలీసులకు అప్పగించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో రాజేంద్ర కృష్ణా, గుంటూరు జిల్లాలో పలువురిని మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడ చిట్టినగర్‌లో నివాసం ఉంటున్న ఓ పురోహితుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు వసూలు చేశాడని తెలిసింది. నగర పోలీస్‌కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లకు రాజేంద్ర బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 14 మంది బాధితులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
స్థలాన్ని ఫ్రీగా ఇచ్చాడు.. కానీ 7నెలలుగా అక్కడే..
సాక్షి,రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని కాశీపూర్ సమితి కుచేయిపొదొరొ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)కి తాళం పడింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందాలని తలచి, పెద్ద మనసుతో స్థలాన్ని దానంగా ఇచ్చిన దాతే ప్రస్తుతం బాధితుడిగా మారాడు. ఇక్కడే గుమస్తాగా పనిచేస్తున్న ఆయనకు గత 7నెలలుగా వేతనం అందకపోవడంతో విసుగెత్తి, పీహెచ్‌సీకి తాళం వేయడంతో పాటు అక్కడే వంటా–వార్పు చేస్తూ ఆందోళనకు దిగాడు. ఇప్పటికే అంతంత మాత్రంగా వైద్య సౌకర్యాలు ఉన్న ఈ సమితిలో ఈ తరహా సమస్యలు తలెత్తడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొరాగుడ పోలీస్ స్టేషన్ ఐఐసీ అజిత్ స్వొయి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుచేయిపొదొరొలో పీహెచ్సీ నిర్మించాలని స్థానికులు ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. 2002లో ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసింది. అయితే అనువైన ప్రభుత్వ స్థలం అభించకపోవడంతో అదే గ్రామానికి చెందిన విభీషన్ నాయక్ తన స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ స్థలంలో 2003లో పీహెచ్‌సీని ఏర్పాటు చేసి, వైద్య సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన స్థలాన్ని ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన నాయక్‌ను అదే ఆరోగ్య కేంద్రంలో గుమస్తాగా ప్రభుత్వం నియమించింది. అయితే గత కొన్నేళ్లుగా తన ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని విభీషన్ నాయక్ ప్రభుత్వానికి నివేదించాడు. సంబంధిత శాఖ అధికారులను కలసి వినతిపత్రాలు కూడా సమర్పించాడు. మరోవైపు గత 7నెలలుగా వేతనం కూడా చెల్లించక పోవడంతో స్థల దాతే బాధితుడిగా మారాడు. ఈ క్రమంలో అధికారుల తీరుపై విసుగెత్తిన ఆయన.. బుధవారం నాడు తన బంధువులతో కలిసి పీహెచ్‌పీ మెయిన్ గేటుకు తాళం వేశాడు. అక్కడే వంట చేస్తూ తన నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, అతనిని బుజ్జగించారు. తాళాలు తెరిచి, సేవలందించేలా చర్యలు చేపట్టారు. చదవండి: Vijay Shekhar Sharma Emotional: జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్ శేఖర్ శర్మ! -
కాంట్రాక్ట్ ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. భరించలేక చివరికి..
లక్నో: దేశంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు అరికట్టడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి సరైన ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లక్నో లోని బాపు భవన్ లో ఓ ప్రభుత్వ అధికారి కాంట్రాక్ట్ ఉద్యోగిని వేధింపులకు గురి చేసి కటకటాల పాలయ్యాడు. వివరాల ప్రకారం .. నిందితుడు ఇచ్చారాం యాదవ్‌ను మైనారిటీ సంక్షేమ శాఖ సెక్షన్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. 2018 నుంచి అక్కడ పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఆ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు. అతని అగాయిత్యాలు భరించలేని ఆమె చివరికి ధైర్యం చేసి, యాదవ్ అకృత్యాలను వీడియోలో చిత్రీకరించింది. అందులో... ఆ మహిళ అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను తనను బలవంతం చేస్తున్నాడు. ఈ ఆధారంతో ఆ మహిళ అక్టోబర్ 29న హుస్సేన్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మహిళ పోలీసులకు సాక్ష్యంగా అనేక వీడియోలను సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గతంలో యాదవ్కుపై ఫిర్యాదు చేసినా పోలీసుల స్పందించలేదని ఆమె ఆరోపించింది. చదవండి: 'నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత.. -
సేవలు చాలని గెంటేశారు.. రోడ్డునపడ్డ జీసీడీఓ కాంట్రాక్టు ఉద్యోగులు..
సాక్షి, కాళోజీ సెంటర్(జనగామ) : విద్యాశాఖలో ఖాళీగా ఉన్న గల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్(జీసీడీఓ) పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన తొమ్మిది సంవత్సరాల క్రితం భర్తీ చేసి వారి సేవలను వినియోగించుకున్నారు. ఇప్పుడు వారి సేవలు చాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు తొలగిస్తునట్లు మార్చి 29న ఉత్తర్వులు జారీ చేయడంతో వారు రోడ్డున పడ్డారు. ఆర్సీ నంబర్ 435/ఆర్బీఎం/ఎస్ఎస్ఏ/బీఏ/2012 జూలై 7న విడదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఎంట్రన్స్ ద్వారా ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి, ఏదైనా ఎన్జీఓలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతినిచ్చి ఇంటర్వూలు నిర్వహించి భర్తీ చేశారు. అందులో అర్హత సాధించిన 20 మందికి జీసీడీఓలుగా మరి కొంత మందికి ఏజీసీడీఓలుగా అవకాశం కల్పించారు. ఇటీవల జీసీడీఓల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అప్పటికే పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి జీసీడీఓలు కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనితోపాటు ఇంత కాలం జీసీడీఓలుగా పనిచేసిన వారిని తొలగిస్తూ.. ఉత్తర్వులు రావడంతో ఉపాధి కోల్పోయి దిక్కుతోచన పరిస్థితిలో పడిపోయారు. కోర్టు సానుకూలత.. ఈ తొమ్మిది ఏండ్లలో జీసీడీఓ హోదాలో పనిచేయించుకొని ఒకసారిగా మీ సేవలు ఇక చాలు అని ఉత్తర్వులు జారీచేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిని కోర్టు వారి సేవలను కొనసాగించుకోవాలని చెప్పింది. కానీ, అధికా రుల అందకు సానుకూలంగా లేరని తెలిసింది. మించిపోయిన వయోపరిమితి.. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే వయోపరిమితి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు తప్పనిసరి. వ యోపరిమితి దాటితే ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అనర్హులు. 9 సంవత్సరాల కాలం విద్యాశాఖ లో జీసీడీఓలుగా పనిచేసిన వారిని ప్రభుత్వం తొలగించడంతో వయస్సు దాటిపోయి మరో ఉద్యోగాని కి నోచుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిని తొలగించి వారి స్థానంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ స్కూల్ అసిసెట్లకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఉపాధి కూలీగా పోయే పరిస్థితి.. ప్రభుత్వం 2012లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మెరిట్ ఆధారంగా మమ్మల్ని జీసీడీఓలుగా తీసుకున్నారు. 9 ఏండ్లుగా సేవలు అందిస్తున్న క్రమంలో సడన్‌గా మీరు అవసరం లేదని తొలిగించడం బాధాకరం. ఇప్పుడు ఎటుగాని పరిస్థితి ఉంది. ఉపాధి కూలీ పనులే దిక్కయ్యేలా ఉన్నాయి. – వై.సంపత్, వరంగల్ రూరల్ జిల్లా క్రమబద్ధీకరిస్తామంటే నమ్మినం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగలును క్రమబద్ధీకరణ చేస్తానని ప్రకటించడంతో ఇంత కాలం నమ్మి పనిచేసినం. ఇప్పుడు ఎటుగాకుండా చేసి వెల్లగొట్టారు. ఇది ఎంతవరకు సమంజసం. ప్రభుత్వం పునరాలోచన చేసి, తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేయాలి. – బండారు విజయ్‌కుమార్, మహబూబాబాద్ -
‘గాంధీ’లో డిష్యుం.. డిష్యుం
గాంధీఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో రెగ్యులర్ ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాంట్రాక్టు కార్మికుడు శంకరయ్య గాంధీ క్యాజువాలిటీ ఆపరేషన్ థియేటర్ (సీఓటీ) వద్ద విధులు నిర్వహిస్తుండగా, రెగ్యులర్ ఉద్యోగి లక్ష్మీపతి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్ఓ)గా పనిచేస్తున్నాడు. ఈనెల 10న హెల్త్ సూపర్వైజర్ రవికుమార్ కార్యాలయం వద్ద వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో హెల్త్ సూపర్వైజర్ సమక్షంలోనే లక్ష్మీపతి, శంకరయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై శంకరయ్య పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగిపై దాడి విషయం తన దృష్టికి వచ్చిందని ఆస్పత్రి నోడల్ అధికారి, కాంట్రాక్టు కార్మికుల ఆర్ఎంఓ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడికి పాల్పడిన లక్ష్మీపతిని తక్షణమే సస్పెండ్ చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. శంకరయ్యకు మద్దతుగా సోమవారం ధర్నా, నిరసన చేప్టటనున్నారు. ( చదవండి: ప్రభుత్వ ధరలకే కోవిడ్ చికిత్స ) -
క్రమబద్ధీకరణ ఒక్కటే మిగిలిపోయింది: సబిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించలేదన్న లోటు మాత్రమే ప్రభుత్వానికి మిగిలిపోయిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని, ఈ మేరకు ఆయన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయపర సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వానికి ఆ ఒక్క లోటు మాత్రమే మిగిలిందని, మిగతా అన్ని హామీలు నెరవేర్చారన్నారు. విద్యపై ఏటా ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. టీచర్ ఉద్యోగాల భర్తీలో భాగంగా 2017లో ఎనిమిదివేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పటికే సగంమంది నియామకాలు సైతంపూర్తయ్యాయని, త్వరలో పూర్తిస్థాయి నియామకాలు చేపడతామన్నారు. -
వదల బొమ్మాళీ!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలోని అధికారులకు ఓ సందేహం వచ్చింది. సమస్యకు పరిష్కారమేమిటో చెప్పేవారు లేరు. ఎన్నికలతో పాటు జీహెచ్ఎసీ యాక్ట్.. నిబంధనల మేరకు సంశయాత్మక సందర్భాల్లో తగిన పరిష్కారాలు చూపేందుకు తప్పనిసరి అవసరం కావడంతో ఈ అంశాల్లో నిష్ణాతుడైన, ఓ విశ్రాంత అధికారిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్నారు. దాంతో అటు అధికారులకు, ఇటు జీహెచ్ఎంసీకి ఎన్నో ఇబ్బందులు తప్పాయి. అనుభవజ్ఞుల సేవలు అవసరం కావడంతో కాంట్రాక్టు పద్ధతిపై నియమించారు. అలాగే టౌన్ ప్లానింగ్‌లోనూ సంపూర్ణ పరిజ్ఞానమున్న ఒకరిని నియమించారు. ఫైనాన్స్, స్పోర్ట్స్ విభాగాల్లోనూ తగిన అనుభవం ఉన్నవారిని రిటైరయ్యాకకాంట్రాక్టు పద్ధతిపై నియమించారు. ఇలాంటి అనుభవం గలవారి సేవలతో జీహెచ్ఎంసీకి ఎన్నో ఇబ్బందులు తప్పాయి. వీరి నియామకాలను ఎవరూ తప్పుబట్టలేరు. ♦ ఇదే అంశాన్ని ఆసరా చేసుకొని పలు విభాగాల్లో రిటైరైన ఉద్యోగులు తిరిగి జీహెచ్ఎంసీలోనే కొనసాగేందుకు పైరవీలు ప్రారంభించారు. రాజకీయంగా, అధికారికంగా పైస్థాయిలోని వారి పరిచయాలను అడ్డం పెట్టుకుని ‘కాంట్రాక్టు’పై తిరిగి చేరుతున్నారు. ఒక్కసారి చేరారో అక్కడే అతుక్కుపోతున్నారు. తొలుత మూణ్నెళ్లు, ఆర్నెళ్లు, ఏడాది కాలానికి కాంట్రాక్టుపై చేరిన వారు గడువు ముగియగానే తిరిగి ‘పొడిగింపు’తో ఏళ్లతరబడి కొనసాగుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీలో రిటైరైన వారి స్థానంలో ఖాళీలు ఏర్పడుతున్నా కొత్తవారిని నియమించే అవకాశం లేకపోతోంది. జీహెచ్ఎంసీ ఏటా దాదాపు రూ.2 కోట్లు ఈ కాంట్రాక్టు నియామకాలకే వేతనాలుగా చెల్లిస్తోంది. ఇక ఔట్సోర్సింగ్ది మరో కథ. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఆయా అంశాల్లో తర్ఫీదునివ్వడం, తగిన నైపుణ్యాలు పెంపొందించడం అవసరం. కానీ జీహెచ్ఎంసీలో ఆ పని జరగడం లేదు. ఇలాంటి నియామకాలకు ఇది కూడా ఒక కారణం. కొందరి అవసరాన్ని ఆసరా చేసుకొని ఎందరో చేరుతున్నారు. వారైనా సరిగ్గా పనిచేస్తున్నదీ లేనిదీ, అసలు విధులకు హాజరవుతున్నదీ లేనిదీ సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకే తెలియాలి. అవసరం లేని సిబ్బందితో ఆర్థిక భారం జీహెచ్ఎంసీ ఖజానాలో నిధులు లేక ఆర్థిక ఇంబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి నియామకాలు, వారి వేతనాలతో స్థపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఇప్పటి దాకా దాదాపు 30 మంది, గతేడాది 40 మంది.. ఏడాదిన్నర కాలంలో 70 మంది వరకు ఇలా ‘కాంట్రాక్టు’పై చేరినట్లు సమాచారం. వీరికి చెల్లించే వేతనాలు ఒక్కొక్కరికి స్థాయినిబట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్టేట్స్, భూసేకరణ, టౌన్‌ప్లానింగ్, ఎన్నికల విభాగాలతో సహా పలు విభాగాల్లో ఇలాంటి నియామకాలు చేస్తున్నారు. వీరిలో చాలామందిని అవసరం లేకపోయినా పునరావాసం కోసం తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీ ఇటీవలి కాలంలో ఔట్‌సోర్సింగ్‌పై దాదాపు 400 మంది ఇంజినీర్లను తీసుకుంది. వారిలో చాలామందికి తగిన పని లేకుండానే జీతాలు చెల్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్వే, తదితర పనులకు వారిని వినియోగించుకునే యోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ అదే పరిస్థితి గతంలో కొన్ని విభాగాల్లోనే రిటైరైన వారిని కాంట్రాక్టుపై తీసుకునేవారు. భూముల కొలతలు, భూసేకరణ వంటి అంశాల్లో తగిన అవగాహన ఉంటుందని రెవెన్యూ విభాగం నుంచి రిటైరైన వారిని తీసుకునేవారు. దీన్ని ఆసరా చేసుకొని తామెందుకు చేరకూడదంటూ అన్ని విభాగాల్లోని వారూ ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో ఒక విభాగమంటూ ఉన్నాక అందులో పనిచేసేందుకు తగిన అవగాహన, సామర్థ్యం ఉన్నవారు లేరనుకోలేం. కానీ లేకనే ఇతరులను తీసుకుంటున్నామని, వారిని తీసుకోకపోతే విభాగమే పనిచేయలేదన్నంతగా బిల్డప్ ఇవ్వడం విచిత్రం. 'ఇలా కాంట్రాక్టుపై నియామకాలు జరిపేటప్పుడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాలి. అంటే స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందాకే ఇలాంటి నియామకాలు జరగాల్సి ఉండగా, చాలా సందర్భాల్లో రిటైరైన ఉద్యోగులు కాంట్రాక్టుపై విధుల్లో చేరాక ఆరేడునెలల అనంతరం కూడా స్టాండింగ్ కమిటీ ముందుంచి ఆమోదం పొందుతుండటం గమనార్హం. ' -
సర్కారు దగా
బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారంతో నిరుద్యోగులను ఎన్నికల సమయంలో బురిడీ కొట్టించి ఓట్లు దండుకున్న ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను దగా చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు నిదర్శనమే సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం...నిజంగా చిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట: జిల్లా సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం దగా చేసింది. జిల్లాలో 167మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ హైస్కూళ్లలో పనిచేస్తున్నారు. ఆర్ట్, క్రాప్ట్, పీఈటీ పోస్టులలో పనిచేస్తున్నాను. ఇంకా 25పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరంతా ఎన్నో ఆశలతో ఎప్పటికైనా తమ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశపడ్డారు. జీతాలు పెంచాలని అమరావతిలో ఇటీవల ఆందోళన కూడా చేశారు. రూ.14వేల వేతనం పెంచుతూ, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల కల్పించే విధంగా జీఓ జారీ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అమలు ఇలా... ఆగస్టు 2017 నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు అని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి వీరి జీతాల నుంచి రికవరి చేశారు. ఆరునెలల నుంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం చెబుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఉన్న స్కీంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎ స్ఐ కల్పించాలనే నిబంధన ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలుచేయాలని చట్టం ఉంది. ప్రస్తుత నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సౌకర్యం అమలులో ఉంది. సర్కారు చేసిన దగా ఇలా... ఎస్ఏస్ఏలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఆగస్టు 2017 నుంచి ఉద్యోగుల జీతాల్లో రికవరీ చేశారు. ఉద్యోగుల షేర్ ఈపీఎఫ్ 12శాతం, ఈఎస్ఐ 1.75శాతం కట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం దగా చేసింది. ఆ ఉత్తర్వులను రద్దుచేసింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు కట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి జమచేయాలని రాష్ట్ర ప్రాజెక్టు డైర్క్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వంపై వెల్లుబుకుతున్న వ్యతిరేకత ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వెల్లుబుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2వేలమందికిపైగా వారు ఉన్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, పార్ట్‌టైం, కేజీబీవి ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపించేందుకు ఉద్యమించనున్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి ఎస్‌ఎస్‌ఎస్‌లో పనిచేసు ్తన్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలుకు ఉత్తర్వులు జారీ చేసి మళ్లీ వాటిని రద్దుచేయడం బాధాకరం. ఆందోళనకు అందరు సిద్ధం కావాలి. ఫిబ్రవరి 15న విజయవాడ అలంకార్ సెం టర్లో సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాకు కదిలి రావాలి. –ఎం.చంద్రశేఖర్, రాష్ట్రకార్యదర్శి, రాష్ట్ర ఉద్యోగుల సంఘం -
అమెరికా మహిళపై గూగుల్ ఉద్యోగి దుర్బుద్ధి..
సాక్షి, న్యూఢిల్లీ : ఓ ఎన్నారై యువకుడు అమెరికన్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ యువకుడు గూగుల్ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు తెలిసింది. తాజ్ ప్యాలెస్ హోటల్లోని తన రూమ్‌లో ఆ యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ నెల(జనవరి) 8న రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్మోల్ సింగ్ ఖర్బందా అనే 22 ఏళ్ల యువకుడు సదరు అమెరికన్ మహిళతో కలిసి హోటల్ బార్లోనే చాలా సేపు గడిపాడు. అనంతరం సిగరెట్ తాగేందుకు ఇద్దరు కలిసి అతడి గదిలోకి వెళ్లారు. ఆ సమయంలోనే అతడు ఆమెతో చెడుగా ప్రవర్తించాడు. చెప్పరాని విధంగా చేతులతో తడిమి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ఆమె వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి జైపూర్ వెళ్లింది. తిరిగి వచ్చే సమయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేసింది. -
విద్యుత్ స్తంభంపై మరమ్మతులు నిర్వహిస్తోండగా..
విద్యుత్ స్తంభంపై మరమ్మతులు నిర్వహిస్తుండగా కరెంట్ సరఫరా జరగడంతో విద్యుద్ఘాతానికి గురై ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎసై ్స లింగ్యానాయక్, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిద్దెమీదిపల్లె గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి (32) గత 12 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి సురారం డివిజన్ న్యూ షాపూర్‌నగర్‌లో ఉంటున్నాడు. గత 12 సంవత్సరాలుగా జీడిమెట్ల సబ్ డివిజన్ షాపూర్‌నగర్ సెక్షన్ ఎస్ఎస్-2లో కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తున్నాడు. సాంబశివారెడ్డికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం ఉదయం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఫేజ్-4 ఎక్స్టెన్షన్ రోడ్డు నెంబర్ 52లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు రాంబాబు, శేఖర్, కొండల్ అనే మరో ముగ్గురితో కలసి మరమ్మతులు నిర్వహించేందుకు సాంబశివారెడ్డి అక్కడకు వెళ్లాడు. అక్కడకు వెళ్లేముందే శాంబశివారెడ్డి సబ్‌స్టేషన్‌లో ఎల్సీ తీసుకున్నాడు. ముగ్గురు ఉద్యోగులు కింద ఉండగా సాంబశివారెడ్డి మాత్రం స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో సాంబశివారెడ్డి బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు. వెంటనే కింద ఉన్న ముగ్గురు ఉద్యోగులు అతని కాపాడేందుకు ప్రయత్నించగా అంతలోనే సాంబశివరెడ్డి స్తంభంపై నుండి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సంఘటనా స్థలాన్ని జీడిమెట్ల ఏడి భాగయ్య, ఎసై ్స లింగ్యానాయక్ సందర్శించారు. సాంబశివారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుద్యోగులకు ఎర !
కాంట్రాక్టు ఉదో్యగాలు ఇప్పిస్తామంటూ వసూళ్ల పర్వం చక్రం తిప్పుతున్న వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు డబ్బులు సమర్పించుకుంటున్న నిరుద్యోగులు మచిలీపట్నం : వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉద్యోగులకు అవినీతి జబ్బు చేసింది. కాంట్రాక్టు ప్రాతిపాదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపాదికన 28 ఏఎన్ఎం, వైద్యులు, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 16వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. సుమారు 2వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 23వ తేదీన ఎంపికైనవారి తుది జాబితాను ఆన్లైన్లో పెడతారు. ఈ క్రమంలో డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయంలో పని చేసే ఇద్దరు ఉద్యోగి, విజయవాడలో మరో అధికారి ఈ పోస్టులు తాము ఇప్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు కల్పిస్తున్నారు. తొలుత ఏడాదిపాటు పని చేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారని, ఆ తర్వాత రెన్యూవల్ లేదా పర్మినెంట్ చేసే అవకాశం ఉంటుందని నమ్మబలుకుతున్నారు. కేవలం రూ.10 వేల నుంచి రూ.15వేలు ఇస్తే చాలు.. ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులు ఆశతో డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక జాబితా తయారు ! తుది ఎంపికకు సమయం దగ్గర పడుతుండటంతో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులు తమదైన శైలిలో దరఖాస్తుదారులకు ఎర వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తులో అభ్యర్థుల అర్హతలు, వచ్చిన మార్కుల వివరాలను పరిశీలించి... ‘మీకే ఉద్యోగం ఇప్పిస్తాం. మెరిట్ జాబితాలో మీ పేరు ఉంటుంది..’ అని నిరుద్యోగులను కలిసి ఆశలు కల్పిస్తున్నట్లు సమాచారం. డబ్బులు వసూలు చేస్తున్న ఉద్యోగులు ప్రత్యేకంగా ఒక జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. కలెక్టర్ పర్యవేక్షణలోనే పోస్టుల భర్తీ ఉంటుందని పైకి ప్రచారం చేస్తూనే... జాబితాలు తామే కదా తయారు చేసేది.. అని బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు సమాచారం. దీంతో పోతే రూ.15వేలే కదా.. అని ఎక్కువ మంది డబ్బులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగానే పోస్టుల భర్తీ వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులను పారదర్శకంగానే భర్తీ చేస్తున్నాం. ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఎంపికైనవారి జాబితాను ఈ నెల 23వ తేదీన ఆన్లైన్లో ఉంచుతాం. ఈ వ్యవహారం మొత్తం కలెక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అభ్యర్థులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు.’ – డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, డీఎం అండ్ హెచ్‌వో -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్
మెదక్: కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా జోగిపేటలోని మహిళా పాల్టెక్నిక్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివశంకర్ అటెండర్ శ్రీకాంత్ నుంచి రెండువేలు లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. (జోగిపేట) -
కాటికి పంపిన కాంట్రాక్టర్!
-
తెరవెనుక బాస్
⇒ మెప్మాలో అవినీతికి ఓ కాంట్రాక్టు ఉద్యోగి సూత్రధారి ⇒ బాస్ అండతో రూ.కోట్లు స్వాహాకు ప్రణాళిక ⇒ వ్యవహారంపై కార్పొరేషన్లో ఇంటెలిజెన్స్ ఆరా ⇒ ఇంత జరుగుతున్నా సిబ్బందిని వెనకేసుకొస్తున్న అధికారి సాక్షి, ఖమ్మం: ‘కంచే చేను మేసిన’ చందంగా మెప్మాలో అవినీతికి ఆ కార్యాలయ బాస్ అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘దోచుకున్నోడికి దొచుకున్నంత మహదేవ’ అన్నట్టు ఆ కార్యాలయ అధికారి కళ్లుమూసుకోవడంతో సిబ్బంది అందినకాడికి దండుకున్నారు. రూ.కోట్ల లింకేజి రుణాలను ఓ ప్రణాళిక ప్రకారం భుజించేశారు. బినామీ గ్రూపుల ఏర్పాటు మొదలు.. సిబ్బంది తమ వాటా కమీషన్‌ను పుచ్చుకోవడంలో కార్యాలయంలోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి అంతాతానై నడిపించినట్లు సమాచారం. నిన్నటి వరకు కార్పొరేషన్లో హల్చల్ చేసిన మెప్మాలోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి బయట పడిన బినామీ గ్రూపుల లింకేజి రుణం స్వాహాలో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు మెప్మా ఉన్నతాధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. సంస్థ బాస్ ఆ ఉద్యోగి మాటను కాదనకపోవడంతో మెప్మా కార్యకలపాలు కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారాయి. ఇన్నాళ్లు రూ.కోట్లలో జరిగిన అవినీతి ఇప్పుడు ఒక్కసారిగా బయటపడడంతో అసలు ఎప్పటి నుంచి ఇది జరుగుతోందనే మెప్మా సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. 2013 నుంచే అవినీతికి బీజం పడినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. మెప్మాలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న బాస్‌కు ఇదంతా తెలియదా..? పలుమార్లు సంస్థలోని కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు అందినా ఏం చేశారు..? అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ఆ బాస్ వ్యవహార శైలిపై అనుమానాలు వస్తున్నాయి. సదరు కాంట్రాక్టు ఉద్యోగి కనుసన్నల్లోనే బినామీ గ్రూపులు పురుడుపోసుకున్నాయని.. ఇందుకు సంస్థ బాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లింకేజి రుణం స్వాహాపర్వానికి అడ్డులేకుండా పోయిందని ఆరోపణలున్నాయి. తాజాగా సోమవారం ఎస్బీహెచ్ పరిధిలోని మరో మూడు బినామీ గ్రూపులు రూ.8 లక్షలు స్వాహా చేసినట్లు బయటపడింది. ఈ అవినీతి బాగోతం సంగతి తేల్చేందుకు మెప్మా ఉన్నతాధికారులు ఖమ్మం వచ్చేందుకు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. ఇన్చార్జి పాలనలో మెప్మా..? మెప్మా ఏర్పాటు అయినప్పటి నుంచి జిల్లాలో ఇన్చార్జి అధికారి పాలనలోనే కొనసాగుతోంది. 2008 నుంచి ఇప్పటి వరకు ఒకే అధికారి విధులు నిర్వహిస్తుండటంతో అవినీతి ఊడలైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ అధికారినైనా మూడు లేదా నాలుగేళ్లలో కచ్చితంగా బదిలీ చేస్తారు. కానీ ప్రస్తుత అధికారి ఎనిమిదేళ్లుగా ఒకే సంస్థకు ఇన్చార్జిగా ఉన్నారు. కాబట్టే మెప్మా కార్యకలాపాలు గాడితప్పాయని విమర్శలున్నాయి. మెప్మాకు పూర్తి స్థాయి అధికారిని నియమించి సమగ్ర విచారణ చేయిస్తేనే లింకేజి రుణం స్వాహా పర్వం కొలిక్కిరానుంది. జిల్లా అధికారులకు బురిడీ.. సదరు బాస్ మాత్రం ..‘లేనిది ఉన్నట్లు’గా అభూత కల్పనలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అవి వాస్తవం కాదని జిల్లా అధికారులను బురిడీ కొట్టించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఏకంగా బ్యాంకులే బినామీ గ్రూపులను డిఫాల్టర్స్‌గా తేల్చడం.. ఈ రుణం నొక్కేసిన వారు తామే చెల్లిస్తామని మరో వైపు ప్రాంసరీ నోట్లతో సెటిల్మెంట్లకు దిగినా దీనితో తనకేమి సంబంధం లేనట్లుగా ఆయన వ్యవహరిస్తుండటం గమనార్హం. మెప్మాలో ఏళ్లుగా పనిచేస్తున్న సదరు బాస్.. లింకేజి రుణం స్వాహా తమ సంస్థకు సంబంధం లేదని, అంతా బ్యాంకు అధికారులే తేల్చాలని తమ సిబ్బందిని వెనకేసుకొస్తుండడం గమనార్హం. కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి మెప్మాలో అంతా తానైనట్లు వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి జిల్లా కార్యాలయ ఉద్యోగులను శాసిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కార్యాలయ కార్యనిర్వాహణ అధికారి ఉన్నా.. ఆమె సీటును ఓ మూలన పడేసి కార్యాలయానికి తానే బాస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.కార్యాలయంలో ఏ ఉద్యోగి అయినా తన మాట వినకపోతే వారిని ఉద్యోగం నుంచి తొలగించడం ఆ ఉద్యోగికి వెన్నతో పెట్టిన విద్య. నిజానికి సదరు ఉద్యోగి మెప్మా గ్రూపులను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణ తరగతులు నిర్వహించడం.. తదితర విషయాల్లో సభ్యులకు అవగాహన కల్పించాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఉన్నతాధికారి అండతో మెప్మాకు షోడో బాస్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇంటెలిజెన్స్ ఆరా గతంలో షాడో కమిషనర్‌గా కార్పొరేషన్ కార్యాలయంలో మెప్మా కాంట్రాక్టు ఉద్యోగి హల్చల్ చేయడం.. ఇప్పుడు లింకేజి రుణం స్వాహాలో సదరు కాంట్రాక్టు ఉద్యోగి హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బృందం సోమవారం ఖమ్మం కార్పొరేషన్లో ఆరా తీసింది. కార్పొరేషన్లో ఆ ఉద్యోగి గతంలో ఏం చేశారు... ఇప్పుడు ఏం చేస్తున్నారన్న కోణంలో కార్పొరేషన్ ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. -
సెక్రటేరియట్లో నీలిచిత్రాల కలకలం
రాష్ట్ర సచివాలయం సకల అక్రమాలకు నిలయంగా మారుతోంది. తాజాగా శనివారం నాడు అక్కడ ఏకంగా నీలిచిత్రాల వ్యవహారం కలకలం రేపింది. ఓ కాంట్రాక్టు ఉద్యోగి నీలిచిత్రాలు చూస్తున్న విషయాన్ని సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని సచివాలయ ప్రధాన భద్రతాధికారి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు సీఎస్‌వో పేర్కొన్నారు.