జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు | Key orders of the Telangana High Court on 16 GO | Sakshi
Sakshi News home page

జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Published Tue, Nov 19 2024 5:55 PM | Last Updated on Tue, Nov 19 2024 6:40 PM

Key orders of the Telangana High Court on 16 GO

సాక్షి,హైదరాబాద్‌ : జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రమబద్దీకరణ (రెగ్యూలరైజ్‌) ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్‌ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

విద్య, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెగ్యూలరైజ్‌ చేసింది. 2016లో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవో 16ను సవాల్‌ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్‌ జీవోను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా.. సుప్రీం కోర్టు తీర్పుకు, రాజ్యాంగంలోని 14, 16, 21 ఆర్టికల్‌కు ప్రభుత్వ నిర్ణయం విరుద్ధమన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం, క్రమబద్దీకరణ ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.

దీంతో పాటు మిగిలిన ఖాళీలను చట్టప్రకారం భర్తీ చేయాలని సర్కార్‌కు ఆదేశించింది. పూర్తి వివరాలను ఆర్డర్‌ కాపీలో పేర్కొంటోమని వెల్లడించింది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులకు తొలగించొద్దన్న హైకోర్టు.. ఇకముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్టప్రకారం చేయాలని ఆదేశించింది. ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా చేయాలని కోర్టు తీర్పును వెలువరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement