ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ,బంజారాహిల్స్: తమ ప్లాట్‌లో అక్రమంగా కార్లు పార్కింగ్ చేయడమే కాకుండా తొలగించాలని చెప్పినందుకు వేధింపులకు పాల్పడుతున్న నిందితులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల సమాచార మేరకు... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 39లో క్రోమా బిల్డింగ్ వెనుకాల ప్లాట్ నెంబర్ 757లో యజమానురాలు ఇటీవల నిర్మాణ భూమి పూజ చేసేందుకు వెళ్లగా ఆ స్థలంలో పక్కనే సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే వ్యక్తి తన కార్లను పార్కింగ్ చేశాడు. ఇదేమిటని ఆమె ప్రశ్నించగా ఆమెపై దుర్భాషలాడాడు.
కార్లు తొలగించను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ హెచ్చరించాడు. ప్లాట్ కబ్జా చేసేందుకు అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నాడని నిలదీసినందుకు తనపై హత్యాయత్నానికి కూడా వెనుకాడటం లేదని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ప్లాట్‌ను ఆక్రమించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. దీంతో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె అంతు చూస్తానని బెదిరించిన సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రం యజమాని సయ్యద్ తౌసిఫ్, సయ్యద్ ఆసిఫ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 447, 506, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Nupur Sharma నూపుర్ శర్మ ఫొటో షేర్ చేసినందుకు షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే
Comments
Please login to add a commentAdd a comment