ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై.. | Love Couple who Resorted to Raigarh Police on Sonapur Brats | Sakshi
Sakshi News home page

ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..

Nov 11 2021 4:46 PM | Updated on Nov 11 2021 5:03 PM

Love Couple who Resorted to Raigarh Police on Sonapur Brats - Sakshi

ప్రేమికులను తీసుకువెళ్తున్న సోనపూర్‌ గ్రామ యువకులు

బరంపురం(భువనేశ్వర్‌): తమ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ప్రేమ జంట రాయిఘర్‌ పోలీసులను బుధవారం ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. నవరంగపూర్‌ జిల్లాలోని రాయిఘర్‌ సమితి, సోనపూర్‌(డీఎన్‌కే) గ్రామంలో ఉన్న తన అక్క ఇంటికి ఈ నెల 8వ తేదీన ఛడిబెడ గ్రామానికి చెందిన ఓ యువతి వచ్చింది. కాళీమాత పూజల సందర్భంగా అదేరోజు రాత్రి గ్రామంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు యువతి హాజరైంది.

అదే చోటుకి వచ్చిన తన ప్రియుడితో కాసేపు మాట్లాడేందుకు కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం నుంచి కొంచెం దూరం వెళ్లారు. అక్కడ ఓ చోట వీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటుండగా గ్రామానికి చెందిన కొంతమంది ఆకతాయిలు వీరిని చుట్టుముట్టి, వారి వివరాలపై ఆరాతీశారు. ఆ తర్వాత వారికి ఇష్టమొచ్చినట్లు వారి బంధంపై మాట్లాడి, బలవంతంగా లాక్కెళ్లారు. వారిద్దరినీ ఓ ఇంట్లో బంధించి, వీడియో తీశారు. కాసేపు తర్వాత వారి ఇద్దరిపై పూలు చల్లి, పెళ్లి చేసినట్లుగా మరో వీడియో తీశారు.

 చదవండి: ('నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..)

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు  

అనంతరం యువతి శరీరంపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి, అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో తనను దయచేసి విడిచిపెట్టాలని ఆ యువతి ఎంత మొరపెట్టుకున్నా వారు వినలేదు. అలాగే బంధించి, ఉంచిన వారిని మరుసటిరోజు ఉదయం విడిచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి సోనపూర్‌కి హుటాహుటిన వచ్చి, యువతిని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన గ్రామ కమిటీ సభ్యులు యువతి తండ్రిపై భౌతికదాడి చేసినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. ప్రస్తుతం తమను బంధించి, చిత్రహింసలు చేసిన వీడియోలు వైరల్‌ కావడంతో తమ పరువు పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రేమికుల జంట పోలీసులను కోరింది. లేకపోతే  తాము ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు.

 చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్‌ అడిగిన ముగ్గురి అరెస్టు!) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement