త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
Published Wed, Aug 17 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
జడ్చర్ల : ఓ ప్రైవేటు బస్సులో కష్ణా పుష్కరాలకు వెళుతున్న భక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జడ్చర్ల మండలం మాచారం వద్ద మంగళవారం ఉదయం 7.20 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 40మందికి గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. కరీంగనర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాష్‌పురానికి చెందిన 55మంది భక్తులు సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు ప్రైవేటు బస్సులో కష్ణాపుష్కరాల్లో పాల్గొనేందుకు అలంపూర్‌కు బయలుదేరారు. డ్రైవర్ మల్లేష్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో అందులోని 40మందికి గాయాలయ్యాయి. కాగా, బస్సు వేగాన్ని రెయిలింVŠ కు ఏర్పాటుచేసిన ఇనుప కడ్డీకి తగిలి ఆగడంతో క్షతగాత్రులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
బాధ్యులపై కేసు నమోదు
ఈ ప్రమాదానికి కారణ మైన బస్సు డ్రైవర్ మల్లేష్, యజమాని నరెందర్‌రెడ్డిలపై ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్ కేసు నమోదు చేశారు. డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఆర్టీసీతో ఒప్పందం ముగిసి ఆరేళ్లు గడిచినా బస్సు రంగును మార్చలేదని షాద్‌నగర్ డీఎం టి.సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటగా ఎక్స్‌ప్రెస్ కలర్‌తోపాటు సిద్దిపేట–సంగారెడ్డి పేర్లను కలిగిన బోర్డులూ ఉండటంతో ఆర్టీసీ బస్సుగా భావించారు. చివరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారించి ఈ బస్సుతో ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.
Advertisement
Advertisement