
సాక్షి,మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో సోమవారం(జులై 15) తెల్లవారుజామున 2 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై భూరెడ్డి పల్లి వద్ద ఏపీలోని ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొని దగ్ధమైంది.
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బస్సు ధర్మవరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
