బాలికల వాలీబాల్‌ పోటీలు ప్రారంభం | girls vallyball torny start at jadcharla | Sakshi
Sakshi News home page

బాలికల వాలీబాల్‌ పోటీలు ప్రారంభం

Published Fri, Sep 9 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

girls vallyball torny start at jadcharla

జడ్చర్ల టౌన్‌: జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జడ్చర్ల విద్యాదర్‌ వాలీబాల్‌ అకాడమిలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాలికల వాలీబాల్‌ పోటీలను డీఎస్‌డీఓ సత్యవాణి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. బాలికలు వాలిబాల్‌ ఆడటం అభినందనీయమన్నారు. జిల్లాలోనూ స్టేడియాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాలిబాల్‌ అకాడమీ ఏర్పాటు చేసి అభివృద్ధికి దోహదపడుతున్న విద్యాదర్‌ను అభినందించారు.పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 24జట్లు పాల్గొంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement