torny
-
వింబుల్డన్ టోర్నమెంట్ రద్దు
లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులదృష్ట్యా... ఈ ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ లాన్‌టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్టీసీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 29 నుంచి జూలై 12 వరకు జరగాల్సింది. వచ్చే ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 28 నుంచి జూలై 11 వరకు జరుగుతుందని ఏఈఎల్టీసీ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వింబుల్డన్ టోర్నీని 1940 నుంచి 1945 వరకు నిర్వహించలేదు. ఆ తర్వాత 1946 నుంచి ప్రతి యేటా వింబుల్డన్ నిరాటంకంగా కొనసాగింది. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వింబుల్డన్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వింబుల్డన్ టోర్నీ రద్దు కావడంతో జూలై 13 వరకు ఎలాంటి టెన్నిస్ టోర్నీలు లేవని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తెలిపాయి. -
క్రీడలతో జిల్లా కీర్తి చాటాలి
రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఖమ్మం స్పోర్ట్స్: క్రీడల్లో ప్రతిభ చాటడం ద్వారా జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్, గ్లోబల్ టేబుల్‌టెన్నిస్ సంయుక్తంగా బోడేపూడి శ్రీకాంత్ స్మారకార్థం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి టేబుల్‌టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నీని ఎమ్మెల్యే అజయ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. జిల్లాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో క్రీడలు ఉపయోగపడతాయన్నారు. టేబుల్‌టెన్నిస్ మంచి క్రీడల్లో ఒకటని, తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. మెళకువలు, నైపుణ్యంతో టెన్నిస్‌లో రాణించవచ్చని అన్నారు. క్రీడా నిర్వహణ ప్రతినిధులు, క్రీడా కమిటీల వారు సమస్యలను వవరిస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు టేబుల్ టెన్నిస్ ఆడారు. పోటీలు ఆసక్తిగా కొనసాగాయి. ఎమ్మెల్యే అజయ్ కూడా కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, చీఫ్ రిపరీ లక్ష్మీకాంత్, టోర్నీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్గార్గే, అంతర్జాతీయ క్రీడాకారుడు మహ్మద్ ఇబ్రహీం ఖాన్, సభ్యులు నరసింహారెడ్డి, మల్లాది వాసుదేవ్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ బాలకిషన్, టూటౌన్ సీఐ రాజిరెడ్డి, ప్రముఖులు రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికల వాలీబాల్ పోటీలు ప్రారంభం
జడ్చర్ల టౌన్: జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్చర్ల విద్యాదర్ వాలీబాల్ అకాడమిలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాలికల వాలీబాల్ పోటీలను డీఎస్డీఓ సత్యవాణి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. బాలికలు వాలిబాల్ ఆడటం అభినందనీయమన్నారు. జిల్లాలోనూ స్టేడియాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాలిబాల్ అకాడమీ ఏర్పాటు చేసి అభివృద్ధికి దోహదపడుతున్న విద్యాదర్ను అభినందించారు.పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 24జట్లు పాల్గొంటున్నాయి. -
క్రీడలు జీవితంలో భాగం కావాలి
సింధూ క్రీడాజీవితం స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ నెల్లూరు(బృందావనం): క్రీడలు ప్రతి ఒక్కరి జీవితం లో భాగం కావాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెక్లీన్స్ క్లబ్ ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజులు జరగనున్న జిల్లా, రాష్ట్రస్థాయి పోటీ ల ఎంపికల టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడారు. బ్యాడ్మింటన్ పోటీలకు నెల్లూరు నుంచి క్రీడాప్రస్థానాన్ని ప్రారంభించిన పీవీ సింధూ రియో ఒలింపిక్స్‌లో రాణిం చడం హర్షణీయమని పేర్కొన్నారు. దేశంలోని యువతకు సింధూ క్రీడాజీవితం ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు నామమాత్ర నిధుల కేటాయింపు దారుణమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెండుగా నిధులను కేటాయించి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో బ్యాడ్మింటన్ ప్రగతికి అసోసియేషన్ పదేళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. నిర్వాహకుడు ద్వారకానాథ్‌ను ప్రశంసించారు. బ్యాడ్మింటన్ అకాడమీని కేటాయించాలి నెల్లూరులో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రభుత్వం కేటాయిస్తే తన వంతు తోడ్పాటును అందిస్తానని డిప్యూటీ మేయర్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరులో క్రీడాఅకాడమీలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొందని, అయితే ఎన్నో వసతులు ఉన్న నెల్లూరు బ్యాడ్మింటన్ క్రీడాఅకాడమీకి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం శోచనీయమన్నారు. అండర్ - 13, 15, 19, వెటరన్, మెన్స్, ఉమెన్స్, బాలబాలికల సింగిల్స్, డబుల్స్ పోటీలకు అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, ఓబిలి రవిచంద్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వాహకులు చంద్రారెడ్డి, బేగ్, అర్జున్‌రావు, వెంకట్, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రెషర్స్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీ విజేతగా రహీం
విజయవాడ స్పోర్ట్స్ : బందరు రోడ్డులోని ఎల్ఈపీఎల్ ఐకాన్‌మాల్‌లోని ఎస్వీఎం బౌలింగ్ సెంటర్లో బుధవారం నిర్వహించిన ఫ్రెషర్స్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీ విజేతగా ఎండీ రహీం నిలువగా, ద్వితీయ, తృతీయ స్థానాలను బి.చంద్రహాస్, విద్యాసాగర్ కైవసం చేసుకున్నారు. అత్యధిక స్కోరర్‌గా అబ్దుల్ ముజీబ్ నిలిచారు. ఈ టోర్నీలో 106 మంది పాల్గొనగా, 94 మంది రెండో రౌండ్‌కు చేరుకున్నారు. 53 మంది ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు. వీరందరికీ బుధవారం ఫైనల్స్ నిర్వహించారు. టోర్నీ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎస్వీఎం ఆపరేషన్స్ మేనేజర్ టి.దుర్గా జగదీష్ మాట్లాడుతూ తొలుత 2009లో హైదరాబాద్‌లో టెన్‌పిన్ బౌలింగ్ ప్రారంభించామన్నారు. 2011లో విజయవాడ ప్రజలకు టెన్‌పిన్ బౌలింగ్‌ను పరిచయం చేసినట్లు చెప్పారు. ఈ సెంటరులో ఎంతో మంది బౌలింగ్ నేర్చుకొని జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచినట్లు చెప్పారు. విజేతలకు మొదటి బహుమతి కింద రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.4 వేలు, తృతీయ బహుమతిగా రూ.2 వేలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఎస్వీఎం అసిస్టెంట్ మేనేజర్ వి.ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.