క్రీడలతో జిల్లా కీర్తి చాటాలి | state level Table tennis torny | Sakshi
Sakshi News home page

క్రీడలతో జిల్లా కీర్తి చాటాలి

Published Fri, Sep 16 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌

 
  • రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ 
  • ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌
 
ఖమ్మం స్పోర్ట్స్‌:
క్రీడల్లో ప్రతిభ చాటడం ద్వారా జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఖమ్మం సర్దార్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్, గ్లోబల్‌ టేబుల్‌టెన్నిస్‌ సంయుక్తంగా బోడేపూడి శ్రీకాంత్‌ స్మారకార్థం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి టేబుల్‌టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీని ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. జిల్లాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో క్రీడలు ఉపయోగపడతాయన్నారు.

టేబుల్‌టెన్నిస్‌ మంచి క్రీడల్లో ఒకటని, తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. మెళకువలు, నైపుణ్యంతో టెన్నిస్‌లో రాణించవచ్చని అన్నారు. క్రీడా నిర్వహణ ప్రతినిధులు, క్రీడా కమిటీల వారు సమస్యలను వవరిస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు టేబుల్‌ టెన్నిస్‌ ఆడారు. పోటీలు ఆసక్తిగా కొనసాగాయి. ఎమ్మెల్యే అజయ్‌ కూడా కాసేపు టేబుల్‌ టెన్నిస్‌ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, చీఫ్‌ రిపరీ లక్ష్మీకాంత్, టోర్నీ ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌గార్గే, అంతర్జాతీయ క్రీడాకారుడు మహ్మద్‌ ఇబ్రహీం ఖాన్, సభ్యులు నరసింహారెడ్డి, మల్లాది వాసుదేవ్, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ బాలకిషన్, టూటౌన్‌ సీఐ రాజిరెడ్డి, ప్రముఖులు రవిమారుత్‌ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement