క్రీడలు జీవితంలో భాగం కావాలి
-
సింధూ క్రీడాజీవితం స్ఫూర్తిదాయకం
-
ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్
నెల్లూరు(బృందావనం): క్రీడలు ప్రతి ఒక్కరి జీవితం లో భాగం కావాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెక్లీన్స్ క్లబ్ ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజులు జరగనున్న జిల్లా, రాష్ట్రస్థాయి పోటీ ల ఎంపికల టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడారు. బ్యాడ్మింటన్ పోటీలకు నెల్లూరు నుంచి క్రీడాప్రస్థానాన్ని ప్రారంభించిన పీవీ సింధూ రియో ఒలింపిక్స్‌లో రాణిం చడం హర్షణీయమని పేర్కొన్నారు. దేశంలోని యువతకు సింధూ క్రీడాజీవితం ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు నామమాత్ర నిధుల కేటాయింపు దారుణమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెండుగా నిధులను కేటాయించి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో బ్యాడ్మింటన్ ప్రగతికి అసోసియేషన్ పదేళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. నిర్వాహకుడు ద్వారకానాథ్‌ను ప్రశంసించారు.
బ్యాడ్మింటన్ అకాడమీని కేటాయించాలి
నెల్లూరులో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రభుత్వం కేటాయిస్తే తన వంతు తోడ్పాటును అందిస్తానని డిప్యూటీ మేయర్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరులో క్రీడాఅకాడమీలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొందని, అయితే ఎన్నో వసతులు ఉన్న నెల్లూరు బ్యాడ్మింటన్ క్రీడాఅకాడమీకి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం శోచనీయమన్నారు. అండర్ - 13, 15, 19, వెటరన్, మెన్స్, ఉమెన్స్, బాలబాలికల సింగిల్స్, డబుల్స్ పోటీలకు అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, ఓబిలి రవిచంద్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వాహకులు చంద్రారెడ్డి, బేగ్, అర్జున్‌రావు, వెంకట్, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.