బ్యాడ్మింటన్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
Published Sun, Sep 25 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
కొత్తపేట :
సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల క్రీడాకారుల ఎంపికలో తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల క్రీడాకారుల హవా నడిచింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఈ నెల 21 నుంచి 24 వరకూ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2016 పోటీలు జరిగాయి. ఫైనల్స్ అనంతరం సౌత్ జోన్ క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ రెండు జిల్లాల క్రీడాకారులు సీనియర్, జూనియర్స్ విభాగాల్లో ఐదుగురు చొప్పున ఎంపికయ్యారు. వీరిలో నలుగురు చొప్పున రెగ్యులర్ క్రీడాకారులు కాగా, ఒక్కొక్కొరు రిజర్వ్ క్రీడాకారులు ఉండడం గమనార్హం.
కేరళలోని ఒట్టుపాలెంలో ఈనెల 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే సౌత్‌జోన్ పోటీలకు 24 మందిని ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో ఎం.కనిష్క(గుంటూరు), సాత్విక్ సాయిరాజ్ (తూర్పుగోదావరి), కృష్ణ ప్రసాద్ (తూర్పు గోదావరి), కె.పి.చైతన్య (శ్రీకాకుళం), కిరణ్‌మౌళి (తూర్పుగోదావరి) ఎంపిక కాగా, రిజర్వ్ సభ్యులుగా బి.కిరణ్‌కుమార్ (విశాఖపట్నం), వి.గంగాధర్ (కృష్ణా)లను ఎంపిక చేశారు.
‘మహిళల విభాగంలో తనిష్క (గుంటూరు), బి.నిషితావర్మ (విశాఖపట్నం), డి.సుధా కళ్యాణి (తూర్పుగోదావరి), వి.హరికా (పశ్చిమ గోదావరి), పి.సోనికా (కృష్ణా)లు ఎంపికయ్యారు.
జూనియర్స్ బాలుర విభాగంలో డి.జశ్వంత్ (చిత్తూరు), ఎం.కనిష్క (గుంటూరు), ఎ.వేదవ్యాససాయి (ప్రకాశం), బషీర్, గౌస్ (నెల్లూరు)లు రిజర్వ్ ఆటగాళ్లుగా ఎస్‌వీ రాయుడు (తూర్పు గోదావరి), పి.చంద్రగోపీనాథ్(గుంటూరు), బాలికల విభాగంలో ఎం.తనిష్క(గుంటూరు), కె.ప్రీతి(విజయనగరం), ఎ.అక్షిత (తూర్పుగోదావరి), రిజర్వ్ స్థానాలకు డి.ఆసియా(కర్నూలు), డి.షబ్నాబేగమ్(కర్నూలు)లు ఎంపికయ్యారని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి ప్రకటించారు. జట్టుకు శాప్‌కు చెందిన జి.సుధాకర్‌రెడ్డి, ఏపీబీఏకు చెందిన జె.బి.ఎస్. విద్యాధర్‌లు కోచ్‌లుగా, ఎం.సుధాకర్‌రెడ్డి మేనేజర్‌గా సేవలందించనున్నారు.
Advertisement