ఫ్రెషర్స్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీ విజేతగా రహీం
ఫ్రెషర్స్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీ విజేతగా రహీం
Published Wed, Jul 27 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
విజయవాడ స్పోర్ట్స్ : బందరు రోడ్డులోని ఎల్‌ఈపీఎల్ ఐకాన్‌మాల్‌లోని ఎస్‌వీఎం బౌలింగ్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన ఫ్రెషర్స్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీ విజేతగా ఎండీ రహీం నిలువగా, ద్వితీయ, తృతీయ స్థానాలను బి.చంద్రహాస్, విద్యాసాగర్ కైవసం చేసుకున్నారు. అత్యధిక స్కోరర్‌గా అబ్దుల్ ముజీబ్ నిలిచారు. ఈ టోర్నీలో 106 మంది పాల్గొనగా, 94 మంది రెండో రౌండ్‌కు చేరుకున్నారు. 53 మంది ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు. వీరందరికీ బుధవారం ఫైనల్స్ నిర్వహించారు. టోర్నీ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎస్‌వీఎం ఆపరేషన్స్ మేనేజర్ టి.దుర్గా జగదీష్ మాట్లాడుతూ తొలుత 2009లో హైదరాబాద్‌లో టెన్‌పిన్ బౌలింగ్ ప్రారంభించామన్నారు. 2011లో విజయవాడ ప్రజలకు టెన్‌పిన్ బౌలింగ్‌ను పరిచయం చేసినట్లు చెప్పారు. ఈ సెంటరులో ఎంతో మంది బౌలింగ్ నేర్చుకొని జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచినట్లు చెప్పారు. విజేతలకు మొదటి బహుమతి కింద రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.4 వేలు, తృతీయ బహుమతిగా రూ.2 వేలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఎస్‌వీఎం అసిస్టెంట్ మేనేజర్ వి.ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement