ఎంతటి విషాదం.. స్కూటీపై వెళ్తుండగానే గుండెపోటు.. వీడియో వైరల్‌ | Raju Deceased With Heat Stroke In Jadcherla Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఎంతటి విషాదం.. స్కూటీపై వెళ్తుండగానే గుండెపోటు.. వీడియో వైరల్‌

Published Fri, Nov 19 2021 9:08 PM | Last Updated on Sat, Nov 20 2021 3:59 PM

Raju Deceased With Heat Stroke In Jadcherla Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్ నగర్: జడ్చర్ల పట్టణానికి చెందిన రాజు అనే ఓ యువకుడు వాహనంపై వెళుతుండగానే గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణంలోని పాత బజార్‌కు చెందిన ఇరవై ఆరేళ్ల రాజు ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని మిత్రులతో చెప్పగా.. ఓ మిత్రుడు తన స్కూటీపై రాజును తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. కాగా మార్గమధ్యంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం.. వాటిని సోషల్ మీడియా ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.

చదవండి: (ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement