సాక్షి, మహబూబ్‌నగర్: జైపాల్ రెడ్డి ఓ సిద్దాంత కర్త అని.. నమ్మిన సిద్దాంతాల కోసం పని చేసిన గొప్ప నాయకుడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తామన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ స్కిల్ సెంటర్ ఆమనగల్లులో ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్-శ్రీశైలం రహదారిని త్వరలో నాలుగు లైన్లుగా మారుస్తామని రేవంత్ అన్నారు. ముచ్చర్లలో ఆగస్టు1న యంగ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 50 ఎకరాల్లో రూ. 100 కోట్లతో పనులు మొదలు పెడతాం.. దీంతో యువత నైపుణ్యాలు పెరుగుతాయని రేవంత్ అన్నారు.
జూలై 31 నాటికంటే ముందే రూ.లక్షన్నర లోపు రుణమాఫీ చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామని రేవంత్ అన్నారు.
‘‘కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్కసీటు కూడా రాదు. కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేసి అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలి’’ రేవంత్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment