
సాక్షి, తూర్పు గోదావరి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం రాష్ట్ర బీజేపీ నేతలు మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర మహిళామోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ... ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిలప్రియను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మానభంగాలకు ఉసిగొల్పుతున్నారంటూ ప్రధాని మోదీపై ఆమె వ్యాఖ్యలు చేయడం సంస్కారహీనంగా ఉన్నాయని అన్నారు. నిరసనలో భాగంగా ఆమె బీజేపీ నేతలతో కలసి తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అఖిలప్రియ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మండల తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment