పెద్దపల్లిటౌన్: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రచార ఆర్భాటాలలో మునిగి తేలుతున్న నరేంద్రమోడీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని టీపీసీసీ సభ్యులు ఈర్ల కొమురయ్య హెచ్చరించారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్‌రహదారి కమాన్‌చౌరస్తా వద్ద శనివారం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచేలా కుట్రపూరితంగా వ్యవహరించడం బీజేపీ ప్రభుత్వానికి తగదన్నారు.
కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తూ కార్మిక, కర్షక, మహిళా, యువత, విద్యార్థి సంక్షేమాన్ని విస్మరించిన మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. మోడీకి హఠావో.. దేశ్‌కి బచావో.. అంటూ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. నిరసనలో నాయకులు బుషనవేని సురేశ్‌గౌడ్, మంథని నర్సింగ్, అక్బర్‌అలీ, సర్వర్‌పాషా, సునిల్‌గౌడ్, కడార్ల శ్రీనివాస్, నల్లగొండ కుమార్, టాంక్ జైదేవ్, పరమేశ్వర్, దొడ్డుపల్లి జగదీశ్, బండి అనిల్, భాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment