ప్రధాని నరేంద్రమోది రాకను నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మోది దిష్టిబొమ్మను ఆదివారం హిమాయత్‌నగర్ వై-జంక్షన్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు బి. రాములుయాదవ్, బోయ ఆంజనేయులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ రెండేళ్ల కాలంలో దళితులు, విద్యార్థులపై బిజేపి కార్యకర్తల దాడులు అధికమయ్యాయన్నారు. యూనివర్సిటిల్లో కమల దళాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులను సైతం కాషాయ రంగు పులుముకోవాలంటూ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సహకరించాలంటూ హుకూం జారీ చేస్తున్నారన్నారు. విద్యార్థులకు, దళితులకు మోది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ నాయకులు రాకేశ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మోది దిష్టిబొమ్మదహనం
Published Sun, Aug 7 2016 5:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement