aiyf
-
కూటమిపై AIYF నేతలు ఫైర్
-
ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా లెనిన్‌బాబు
కర్నూలు సిటీ: అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శిగా ఎన్.లెనిన్‌బాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, రంగన్న, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాముడు, కారుమంచి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4,5,6 తేదీల్లో పుదుచ్చేరిలో జరిగిన జాతీయ సమితి సమావేశాల్లో లెనిన్‌ను జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. -
క్రియాశీల పోరాటాలకు సిద్ధం కండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ధన రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా యువత క్రియాశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై పిలుపునిచ్చారు. స్థానిక టుబాకో మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ 20వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మోడీ ప్రభుత్వం మతరాజకీయాలు చేస్తూ, హిందూ మతోన్మాదులను ప్రోత్సహిస్తూ దళిత, ముస్లిం, క్రైస్తవ, మైనార్టీలపై దాడులకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు. మతోన్మాదుల శక్తులకు వ్యతిరేకంగా దేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణకు యువత నడుం బిగించాలని కోరారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి ధన రాజకీయాలను ఎండగట్టేందుకు విద్యార్థులు, యువజనులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 70 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తామని, 10 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని బీజేపీ నాయకులు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సినీ నటుడు మాదాల రవి మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన అవినీతి, విష సంస్కృతి లాంటి జబ్బులను అభ్యుదయ కళ ద్వారా నయం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఔషధమని, దీని కోసం యువత, విద్యార్థులు పోరాడాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు గని, చంద్రానాయక్, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మోది దిష్టిబొమ్మదహనం
ప్రధాని నరేంద్రమోది రాకను నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మోది దిష్టిబొమ్మను ఆదివారం హిమాయత్‌నగర్ వై-జంక్షన్లో దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు బి. రాములుయాదవ్, బోయ ఆంజనేయులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ రెండేళ్ల కాలంలో దళితులు, విద్యార్థులపై బిజేపి కార్యకర్తల దాడులు అధికమయ్యాయన్నారు. యూనివర్సిటిల్లో కమల దళాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులను సైతం కాషాయ రంగు పులుముకోవాలంటూ, ఆర్ఎస్ఎస్కు సహకరించాలంటూ హుకూం జారీ చేస్తున్నారన్నారు. విద్యార్థులకు, దళితులకు మోది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ నాయకులు రాకేశ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలుకు పోరాటం
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో చంద్రబాబు యువతకు ఇచ్చిన హామీల అమలుకోసం పోరుబాట పట్టినట్లు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రమణ వెల్లడించారు. గురువారం చండ్రరాజేశ్వరరావు కాలనీలో నగర అధ్యక్షులు జమీర్ అధ్యక్షతన జరిగిన ఏఐవైఎఫ్ శాఖ సమావేశానికి రమణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇంతవరకూ దాన్ని అమలు చేయలేదన్నారు. అందువల్లే సీఎం నయవంచన పాలనపై యువతను చైతన్యం చేసి పోరాటాలకు సమాయత్తం చేస్తామన్నారు. అనంతరం శాఖ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గం ఏఐవైఎఫ్ శాఖ నూతన కమిటీ అధ్యక్షులు బి.ఈశ్వరయ్య, కార్యదర్శిగా ఎ.నాగరాజు, ఉపాధ్యక్షులుగా వినోద్, పి.నరేంద్ర, సురేష్, సహాయ కార్యదర్శులుగా షేక్షావలి, సాయి, కృష్ణమూర్తి, కోశాధికారిగా మహేష్‌ను ఎన్నుకున్నారు. అదే విధంగా 39 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ప్రత్యేక హోదా లేకపోతే ఉద్యోగాలు ఎలా?
AIYF, applications, unemployees నిరుద్యోగభృతి, దరఖాస్తులు, ఏఐవైఎఫ్ మొగల్రాజపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐౖవైఎఫ్) నగర కార్యదర్శి పి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని, లేదంటే నిరుద్యోగులకు రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరుతూ గురువారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ జంక్షన్లో నిరుద్యోగభృతి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం జరిగింది. ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి బీజేపీపై ఒత్తిడి తీసుకురాకపోవడం సరికాదన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నారన్నారు. తెలంగాణాల్లో గ్రూప్,1,2,3,4లకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే మన రాష్ట్రంలో ఆ నోటిఫికేషన్ల ఊసే లేదన్నారు. ప్రతి విషయంలో తెలంగాణాతో పోటీ పడుతున్న చంద్రబాబునాయుడు ఉద్యోగాల భర్తీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నాడని ప్రశ్నించారు. ఎంబీఏ గోల్డ్‌మెడలిస్ట్ పొందిన వారికి కూడా ఉద్యోగాలు కల్పించలేని స్థితిలో పాలకులు ఉన్నారన్నారు. సేకరించిన దరఖాస్తులన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సమాఖ్య ఏడో డివిజన్ అధ్యక్షుడు ఆర్.ప్రకాశరావు, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఎ.రాము, సూరిబాబు,నూకరాజు, కె.విజయ్‌లతో పాటుగా సి.పి.ఐ. డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శీతల పానీయాలు వద్దు - కొబ్బరి బోండాలే ముద్దు
-
బెల్టుషాపులు ఎత్తేయాలని ఏఐవైఎఫ్ ధర్నా
ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో బెల్టుషాపులు ఎత్తివేయాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో మండల ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. బెల్టుషాపులు ఎత్తివేయాలని ఏఐవైఎస్ సభ్యులు ధర్నా చేశారు. బెల్టుషాపులు ఎత్తివేయకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవితో పాటు మండలానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.