ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో బెల్టుషాపులు ఎత్తివేయాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో మండల ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. బెల్టుషాపులు ఎత్తివేయాలని ఏఐవైఎస్ సభ్యులు ధర్నా చేశారు.
బెల్టుషాపులు ఎత్తివేయకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవితో పాటు మండలానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.