అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో చంద్రబాబు యువతకు ఇచ్చిన హామీల అమలుకోసం పోరుబాట పట్టినట్లు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రమణ వెల్లడించారు. గురువారం చండ్రరాజేశ్వరరావు కాలనీలో నగర అధ్యక్షులు జమీర్ అధ్యక్షతన జరిగిన ఏఐవైఎఫ్ శాఖ సమావేశానికి రమణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇంతవరకూ దాన్ని అమలు చేయలేదన్నారు. అందువల్లే సీఎం నయవంచన పాలనపై యువతను చైతన్యం చేసి పోరాటాలకు సమాయత్తం చేస్తామన్నారు. అనంతరం శాఖ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.
నూతన కార్యవర్గం
ఏఐవైఎఫ్ శాఖ నూతన కమిటీ అధ్యక్షులు బి.ఈశ్వరయ్య, కార్యదర్శిగా ఎ.నాగరాజు, ఉపాధ్యక్షులుగా వినోద్, పి.నరేంద్ర, సురేష్, సహాయ కార్యదర్శులుగా షేక్షావలి, సాయి, కృష్ణమూర్తి, కోశాధికారిగా మహేష్‌ను ఎన్నుకున్నారు. అదే విధంగా 39 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.