అక్కినేని నాగార్జున హీరోగా 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఘోస్ట్. సోనాల్ చౌహాన్ కథానాయిక. నాగ్, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.
కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఘోస్ట్ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయట. ఒకవేళ ఏదైనా భారీ డీల్ కుదిరితే మాత్రం నేరుగా ఓటీటీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ఓటీటీలు పెద్ద మొత్తంలో ఆఫర్ ఇవ్వకపోతే మాత్రం ఈ ఏడాది చివర్లో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఘోస్ట్ ఓటీటీని ఎంచుకుంటుందా? థియేటర్‌నా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!
చదవండి: ఆరేళ్ల రిలేషన్.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది
మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్
Comments
Please login to add a commentAdd a comment