
పరుపుపై దెయ్యం.. వణికిపోతున్న ఆస్పత్రి!
దాదాపు గుండెలు ఆగిపోయేంత రేంజ్‌లో ఉన్న హర్రర్ చిత్రం చూసినంత భయం ఇప్పుడు అర్జెంటీనాలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నవారిని అలుముకుంది.
అర్జెంటీనా: దాదాపు గుండెలు ఆగిపోయేంత రేంజ్‌లో ఉన్న హర్రర్ చిత్రం చూసినంత భయం ఇప్పుడు అర్జెంటీనాలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నవారిని అలుముకుంది. తాము చూసిన విషయాన్ని బయటకు చెప్పేందుకు వారికి గొంతులు పెగలట్లేదు. కొంతమంది ఆ సన్నివేశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా విన్నవారిలో కొంతమంది ఈ రోజుల్లో ఇది నిజామా అని కొట్టి పారేస్తుండగా.. తిరిగి అదే భయంతో అవును.. వారు చెప్పేది నిజమే మాక్కూడా ఆ అనుభవం ఎదురైంది.. మేం కూడా చూశాం ఓ పిల్ల దెయ్యాన్ని అంటూ చెప్పడంతో ఇప్పుడు ఆస్పత్రి వర్గాలు వణికిపోతున్నాయి.
అర్జెంటీనాలోని కార్డోబా అనే పిల్లల ఆస్పత్రి ఉంది. అందులో గంట వ్యవధిలో ఓ చిన్న బాలిక స్వరం పలుమార్లు వినిపిస్తుందట. వాస్తవానికి అక్కడ ఎవరూ లేకపోయినా అదే గొంతు పలువురికి వినిపించడంతోపాటు కారిడార్లలో తమను చూసి నవ్వుకుంటూ ఏదో రూపం వెళుతుందంట. దీంతో ఆ అరుపులు వచ్చే గదివైపు తీక్షణగా చూసిన ఓనర్సుకు చిన్న పాప వయసులో ఉన్న ఒక దెయ్యపు ఆత్మ అందులోని పరుపు చాటున దాక్కున్నట్లు కనిపించందట. ఇక అంతే.. అది చూసిన ఆమె గట్టిగా కేకలు పెట్టింది. ఆస్పత్రి వర్గాలంతా ఆమెను చేరి ఏం జరిగిందని ప్రశ్నించగా తాను దెయ్యం పిల్లను చూశానని చెప్పింది. అంతా బిక్కుబిక్కుమంటూ తమ పనుల్లోకి వెళ్లగా ఓ నర్సు మాత్రం తన ఫోన్ తీసుకొని ఆ గదిలో ఏం జరుగుతుంది అసలని తన ఫోన్‌తో షూట్ చేసే ప్రయత్నం చేసింది.
అందులో కూడా ఓ పాపలాంటి ఆకారం చాలా సేపు మంచం పరుపు చాటున దాచుకొని మెల్లగా బెడ్‌పైకి పాకి.. ఆ తర్వాత కారిడార్ నుంచి వెనుక వైపున్న కిటికీలో నుంచి అవతలికి దూకేస్తూ కనిపించిందంట. దీంతో ఆమె కూడా అవాక్కయి కేకలు పెట్టింది. అయితే, అక్కడి చాలామంది మాత్రం ఆ విషయాన్ని నమ్మడం లేదు. బెడ్ నీడే అలా పడి కన్ఫ్యూజ్ చేసి ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ గదిలో గతంలో చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో వారిలో ఎవరిదో ఒకరి ఆత్మ అలా దెయ్యమై తిరుగుతుందని అంటున్నారు.