దెయ్యం బాబోయ్! | Haris Sohail feels supernatural presence in his room in New Zealand | Sakshi
Sakshi News home page

దెయ్యం బాబోయ్!

Published Tue, Jan 27 2015 8:07 AM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM

దెయ్యం బాబోయ్! - Sakshi

దెయ్యం బాబోయ్!

గది మార్చమన్న పాక్ క్రికెటర్ సొహైల్
 
లింకన్: పాకిస్థాన్ యువ క్రికెటర్ హారిస్ సొహైల్‌కు హోటల్ గదిలో వింత అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన గదిలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ బెంబేలెత్తిపోయాడు. ప్రస్తుతం పాక్ జట్టు న్యూజిలాండ్‌లో ఉంది. ఇక్కడ సోమవారం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడిన జట్టు, స్థానిక హోటల్‌లో బస చేసింది.

అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కి పడి లేచిన సొహైల్, ఏవో వింత దృశ్యాలు తన గదిలో కనిపించాయని, అవి దెయ్యాలే అని చెప్పుకొచ్చాడు. పాపం... ఈ దెబ్బకు అతనికి ఒక్కసారిగా తీవ్ర జ్వరం కూడా వచ్చేసింది! దాంతో వెంటనే హోటల్ సిబ్బంది సొహైల్‌ను మరో గదిలోకి మార్చి ఉపశమనం కలిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement