Haris Sohail
-
వారిద్దరూ ఇంగ్లండ్ టూర్‌కు డుమ్మా
కరాచీ: ఒకవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే క్రికెట్ టోర్నీలు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ పర్యటనకు వెస్టిండీస్ వెళ్లింది. గత మంగళవారం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన వెస్టిండీస్..మూడు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా, వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌కు పాకిస్తాన్ పయనం కానుంది. అయితే ఇద్దరు పాక్ స్టార్ ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాలను చూపిన పేసర్ మొహ్మద్ అమిర్, బ్యాట్స్‌మన్ హారిస్ సొహైల్‌లు ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యారు. ఆగస్టు నెలలో అమిర్ భార్య ప్రసవించే సమయం. దాంతో తాను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం కుదరదని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు. (ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు...) ఇక సొహైల్ కుటుంబంతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో అతను కూడా ఆ పర్యటనకు సుముఖత వ్యక్తం చేయలేదు. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా ఆటగాడు మహమ్మారి బారిన పడితే వేరే వాళ్లు అందుబాటులో ఉంచడం కోసం 28 మందిని ఇంగ్లండ్‌కు పంపించనుంది. అదే సమయంలో 14 మంది సపోర్టింగ్ స్టాఫ్‌ను ఇంగ్లండ్‌కు పంపించడానికి పీసీబీ సన్నద్ధమైంది. ఇదిలా ఉంచితే, ఈ నెల చివర్లో శ్రీలంక వేదికగా జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా రద్దు చేసుకుంది. ఇంకా కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఆ పర్యటనను రద్దు చేసుకుంది. శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళుతుందనే తొలుత వార్తలు వచ్చినా వాటిలో వాస్తవం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. భవిష్యత్తులో రద్దు చేసుకున్న టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లను ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసింది. (‘కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్.. కానీ ఐదేళ్లలో’) -
పాక్‌కు చివరకు మిగిలింది రిక్తహస్తమే..
లాహోర్: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు చివరకు రిక్తహస్తమే మిగిలింది. తన కంటే ఎంతో బలహీనమైన శ్రీలంక చేతిలో పాక్ వైట్‌వాష్‌కు గురయింది. టీ20లో నంబర్ వన్ స్థానంలో ఉండి, స్వదేశంలో జరుగుతున్న తొలి పొట్టి సిరీస్‌ను పాక్ కాపాడుకోలేకపోయింది. తొలి రెండు టీ20ల్లో ఓడిపోయిన పాక్ చివరి మ్యాచ్‌లో గెలిచి కనీసం పరువు కాపాడుకోవలనుకుంది. కానీ నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన మూడో టీ20లో పాక్‌పై శ్రీలంక 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20 సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ పనిపట్టడంతో పాటు, సిరీస్‌లో నిలకడగా రాణించిన వనిండు హసనరంగాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు లభించాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఒషాదా ఫెర్నాండో (78 నాటౌట్, 48 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు) రఫ్పాడించడంతో పాక్ ముందు లంక మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్టు కోల్పోఇయ 134 పరుగులే చేసి ఓటమి పాలైంది. పాక్ ఆటగాళ్లలో హారిస్ సోహైల్ (52; 50 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. లంక బౌలర్లలో వనిండు హసరంగా మూడు వికెట్లతో చెలరేగగా.. లహిరు కుమార రెండు వికెట్లతో రాణించాడు. -
ఇండియాపై నా సత్తా చూపిస్తా: పాక్ క్రికెటర్
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో బద్ధ విరోధి భారత్‌పై తన సత్తా ఏంటో చాటేందుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ సోహైల్ తెలిపాడు. ఉమర్ అక్మల్ ఫిట్నెస్ టెస్టులో ఫెయిలవ్వడంతో అతని స్థానంలో పాకిస్థాన్ జట్టులోకి సోహైల్ వచ్చాడు. అన్‌ఫిట్ అని తేలడంతో అక్మల్‌ను ఇంగ్లండ్ నుంచి అర్ధంతరంగా వెనుకకు పిలిపించిన సంగతి తెలిసిందే. అనంతరం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టుల్లో అతను ఫెయిలవ్వడంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో పాక్ జట్టు ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. 2015 మేలో జింబాబ్వే పర్యటనలో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 28 ఏళ్ల సోహైల్ తిరిగి జాతీయ జట్టులోకి అడుగుపెట్టడంతో సంతోషం వ్యక్తం చేశాడు. ‘జట్టు విజయం కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను. ప్రతి ఆటగాడు కూడా భారత్‌పై బాగా ఆడాలని కోరుకుంటాడు. భారత్‌తో మ్యాచ్‌లో నాకు ఆడేందుకు అవకాశం వస్తే.. తప్పకుండా నా ఉత్తమ ఆటతీరు చూపేందుకు ప్రయత్నిస్తా’ అని సోహైల్ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికతో చెప్పాడు. చాంపీయన్స్ ట్రోఫీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జూన్ 4న బర్మింగ్‌హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడుతుండటంతో ఇప్పుడు ఇరుదేశాల్లోని క్రికెట్ ప్రేమికుల దృష్టి మ్యాచ్‌పైనే నెలకొని ఉంది. -
దెయ్యం బాబోయ్!
గది మార్చమన్న పాక్ క్రికెటర్ సొహైల్ లింకన్: పాకిస్థాన్ యువ క్రికెటర్ హారిస్ సొహైల్‌కు హోటల్ గదిలో వింత అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన గదిలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ బెంబేలెత్తిపోయాడు. ప్రస్తుతం పాక్ జట్టు న్యూజిలాండ్‌లో ఉంది. ఇక్కడ సోమవారం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడిన జట్టు, స్థానిక హోటల్లో బస చేసింది. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కి పడి లేచిన సొహైల్, ఏవో వింత దృశ్యాలు తన గదిలో కనిపించాయని, అవి దెయ్యాలే అని చెప్పుకొచ్చాడు. పాపం... ఈ దెబ్బకు అతనికి ఒక్కసారిగా తీవ్ర జ్వరం కూడా వచ్చేసింది! దాంతో వెంటనే హోటల్ సిబ్బంది సొహైల్‌ను మరో గదిలోకి మార్చి ఉపశమనం కలిగించారు.