ఇదొక చిత్రమైన కేసు. కాలిఫోర్నియా స్టాక్‌టన్‌కు చెందిన ఓ వ్యక్తి.. దెయ్యం తన మొబైల్ నుంచి మెసేజ్‌లు పంపుతోందని, రిప్లయ్‌లు కూడా ఇస్తోందని వాదిస్తున్నాడు. నలభై ఏళ్ల ఆ వ్యక్తి తన ప్రియురాలితో ఇంగ్లండ్‌లోని యార్క్ నగరానికి టూర్‌కి వెళ్లాడు. అయితే అది హాంటెడ్ సిటీ అని, అక్కడ ఒక పబ్ దగ్గర ఫొటో తీస్తే.. దెయ్యం కనిపించిందని, అప్పటి నుంచి తనకు పారానార్మల్ యాక్టివిటీస్ (విచిత్రమైన అనుభవాలు) ఎదురవుతున్నాయని చెప్తున్నాడు.
అంతేకాదు.. ఆనాటి నుంచి తన ఫోన్ నుంచి తనకు తెలియకుండానే ప్రియురాలికి సందేశాలు వెళ్తున్నాయని, ఇదంతా దెయ్యం పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులనూ ఆశ్రయించాడు. ప్రస్తుతం అతగాడిని మానసిక వైద్యుల పర్యవేక్షణలో విచారిస్తున్నారు పోలీసులు. అయితే పారానార్మల్ యాక్టివిస్ట్‌లు ఈ కేసును ఆసక్తికరంగా గమనిస్తున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఆ వ్యక్తికి ఇలాంటి అనుభవాలు మొదలయ్యాయని ‘టీసిడె లైవ్ రిపోర్ట్స్’ ఒక కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment