
లండన్: ఆత్మ, పునర్జన్మ, దెయ్యాలు వంటి అంశాలకు ముగింపు దొరకడం కష్టం. ఇక సెలబ్రిటీలు చనిపోయినప్పుడు పలువురు.. వారి ఆత్మలు తమతో మాట్లాడుతున్నాయని.. వారు తమకు కనిపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. దెయ్యంగా మారిన మైఖేల్ జాక్సన్ తనను పెళ్లి చేసుకున్నాడని.. తన శరీరంలో ప్రవేశించి డ్యాన్స్ చేయడం, తినడం, పాటలు పాడటం వంటి పనులు చేస్తున్నాడని తెలిపింది. మైఖేల్ జాక్సన్ ఆత్మ తన శరీరంతో శృంగారం తప్ప అని పనులు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఆ వివరాలు..
యూకేకు చెందిన కాథ్లీన్ రాబర్ట్స్ అనే మహిళ తాను మార్లీన్ మన్రో పునర్జన్మ అని.. అంతే కాక దెయ్యంగా మారిన మైఖేల్ జాక్సన్ తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఈ విషయాలన్నింటిని కాథ్లీన్ గతేడాది ఓ న్యూస్ పేపర్‌లో ప్రచురించడంతో ఇవి వెలుగులోకి వచ్చాయి. దానిలో ఆమె ‘‘అతీతశక్తులకు సంబంధించి నా అనుభవాలను మీతో పంచుకోవలనుకుంటున్నాను. నేను దెయ్యంతో నివసిస్తున్నాను. ఆ దెయ్యం గురించి భూమ్మీద అందరికి తెలుసు. అది మైఖేల్ జాక్సన్’’ అని తెలిపింది.
మైఖేల్ అనుక్షణంతో నాతోనే ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వస్తాడు.. ఆఖరికి రెస్ట్‌రూమ్‌కు కూడా నాతో పాటు వస్తాడు. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధ క్షణాలను అతడు టాయిలెట్రైస్ అని పిలుస్తాడు. మైఖేల్ నాతో చాలా విషయాలు మాట్లాడతాడు. టీవీల్లో మనం చూసే మైఖేల్ జాక్సన్ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ నాలో ఉన్న మైఖేల్ జాక్సన్ అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు’’ అని తెలిపారు.
‘‘మైఖేల్ జాక్సన్ నాలో ఉండి విశ్రాంతి తీసుకుంటాడు.. నా శరీరంలో ఉండి ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ భర్తలా నాతో మాట్లాడతాడు. తనకు కుకీస్ అంటే చాలా ఇష్టం. నాలో ఉండి వాటిని తింటాడు. తను నా శరీరంతో అన్ని పనులు చేస్తాడు. శృంగారం మాత్రం చేయడు. నేను ప్రయత్నిస్తే.. సాలీడు నీడ, శవాల ఆకారాలతో నన్ను భయపెడతాడు. నేను చేసే తప్పులను ఎత్తి చూపుతాడు’’ అని తెలిపింది. ఇక మైఖేల్ జాక్సన్ 2009లో జూన్ 25న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment