లండన్: సాధారణంగా దెయ్యాలు అనగానే అర్థరాత్రి పూట.. నిర్మానుష్య ప్రాంతంలో తిరుగుతుంటాయి.. పాడుబడిన బంగళాల్లో ఉంటాయి.. ఎవరు లేని చోట తచ్చాడతాయనే ఎక్కువగా వింటుంటాం. ఇక సినిమాలు, కథల్లో కూడా ఇలానే చూపిస్తారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ ఓ దెయ్యం ఏకంగా పబ్‌కే వస్తుంది. పైగా తాను వచ్చానని అందరికి తెలియజెప్పడం కోసం రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
కార్డిఫ్‌లోని ది లాన్స్‌డౌన్ పబ్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది జూలై 26 సాయంత్రం ఓ మహిళ లాన్స్‌డౌన్ పబ్‌కి వెళ్లింది. ఓ టేబుల్ మీద కూర్చుంది. అక్కడ మొత్తం నాలుగు కుర్చీలుండగా.. ఒకదాంటో ఆమె కూర్చుంది. మిగిలిన మూడు చైర్లు ఖాళీగా ఉన్నాయి. తన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ.. మొబైల్ చూడసాగింది. ఇంతలో ఆమెకు ఎదురుగా ఉన్న వరుసలోని కుర్చీ సడెన్‌గా కదిలింది. ఇది గమనించిన సందరు మహిళ చైర్ కింద ఏమైనా ఉందేమోనని చెక్ చేసింది. ఏం కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యింది. (చదవండి: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..)
మేనజర్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. సీసీటీవీ ఫూటేజ్ చెక్ చేసి ఆశ్చర్యపోయింది. ఆ కుర్చీ దానంతట అదే కదలడం చూసి ఆమె భయపడింది. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నేను దెయ్యాలు వంటి వాటిని నమ్మను. లాజిక్ లేని విషయాలను అసలు పట్టించుకోను. కానీ సీసీటీవీ పుటేజ్ చూసి నేను ఆశ్చర్యపోయాను’’ అని తెలిపింది. (చదవండి: జిమ్‌లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది)
దీని గురించి పబ్‌లో ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ‘‘మొదట్లో నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఓ రోజు ఉన్నట్లుండి చాక్‌బోర్డ్ దానంతట అదే ఊగడం చూశాను. అప్పుడు చాలా భయపడ్డాను. కానీ సదరు దెయ్యం మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కేవలం తన ఉనికిని మేం గుర్తించాలనే ఉద్దేశంతో ఇలా ఫర్నిచర్‌ను కదుపుతూ ఉంటుంది. నెమ్మదిగా మాకు అలవాటయిపోయింది’’ అని తెలిపింది. (చదవండి: 'ఘోస్ట్'గా కింగ్ నాగార్జున.. ఫస్ట్‌లుక్ అవుట్)
పబ్ మేనేజర్ మాట్లాడుతూ.. ఇ‘‘క్కడ ఇలాంటి వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. మా పబ్‌పై ఉన్న ఇళ్లల్లో నివసించే వారికి కూడా ఇలాంటే అనుభవాలు ఎదురయ్యాయి. ఇక పబ్ టైమింగ్స్ పూర్తయ్యాక నేను బయట కూర్చుని పేపర్ వర్క్ చేసుకుంటుంటే ఫర్నిచర్‌ను కదిలిస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి. వెళ్లి చూడగానే శబ్దాలు ఆగిపోయేవి’’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment