CCTV camera captures pen moving on its own: ఇటీవల ఒక ప్రోఫెసర్ దెయ్యాలు ఉన్నాయి అంటూ తెగ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత యూఎస్‌లో ఒక పార్క్‌లో దెయ్యం కూర్చోని ఉంటుందటూ భయపడితే అదేంటో అంతు తేల్చడానికి వెళ్లిన వాళ్లు అది ఒక షాప్‌లో ఉండే బొమ్మ అని చెప్పి సందేహాన్ని క్లియర్ చేశారు. కానీ యూకేలోని పబ్‌ని చూస్తే ఇప్పుడూ కచ్చితంగా మీరు నిర్ణయం మార్చుకుంటారు. పైగా సీసీఫుటేజ్‌లో రికార్డు అయిన వాటిని చూస్తే మాత్రం ఔనును దెయ్యలు ఉన్నాయని అనుకుండా ఉండలేరు.
అసలు విషయంలోకెళ్తే...యూకేకి చెందిన రిచెల్ స్టాక్స్, ఆష్లీగ్ నైస్‌బిట్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు డార్లింగ్‌టన్‌లోని మార్పెత్‌లో బ్లాక్ అండ్ గ్రే పబ్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత నంచి వారే ఆ పబ్‌ని నడపడం మొదలు పెట్టారు. అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. పబ్‌లో వింత వింత శబ్దాలు రావడం, వస్తువులన్నీ వాటంతట అవే కదలడం జరిగింది. దీంతో ఆ పబ్‌లో పనిచేసే సిబ్బంది సైతం విధులకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. అంతేకాదు ఆ అక్కాచెల్లళ్లు పబ్‌లోని మెట్లమీద నుంచి నడుస్తుంటే ఏవో వింత శబ్దం వచ్చిందని, పైగా సెల్లార్‌కి వెళ్లాలన్న భయంగా ఉందని పేర్కొన్నారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఈ మేరకు పోలీసులు ఆ పబ్‌ని తనిఖీ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ఈ అక్కా చెల్లెళ్లు పోలీసుల ముందే దెయ్యాలు ఉన్నాయని చూపించేందుకు ఒక సాహసం చేశారు. ఈ క్రమంలో వాళ్లు ఒక పెన్‌ని చేతిలో పెట్టుకుని ఇక్కడ ఎవరైన ఉంటే ఈ పెన్నుని కదిలించండి అన్నారు. అంతే కాసేపటికి నిజంగానే ఆ పెన్ను దానంతటే అదే కదిలింది. దీంతో భయంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఆ పబ్‌లోని సీసీఫుటేజ్‌ని పరిశీలించి చూస్తే ...నిజంగానే ఏవో వింత ఆకారాలు, మనిషి నీడలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైయ్యారు. అంతేకాదు ఈ సీసీఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ధైర్యం ఉంటే మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: బిగ్గరగా మాట్లాడుతోందని ఆ లెక్చరర్‌ను ఏం చేశారంటే?)
Comments
Please login to add a commentAdd a comment