devils
-
Farooq Abdullah: వాళ్లు ఢిల్లీ పంపిన వ్యక్తులు..జాగ్రత్త!
శ్రీనగర్: ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి..ఢిల్లీ పంపిన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి..! మారు వేషంలో ఉన్న దయ్యాలను తిరస్కరించండి’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్‌ల కూటమి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటో తేదీన జరిగే మూడో, చివరి విడత ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలన్నారు. ‘చేయి (కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) కనిపిస్తే చేతికే ఓటేయండి. నాగలి(ఎన్సీ ఎన్నికల గుర్తు) కనిపిస్తే నాగలికే ఓటేయండి’అని కోరారు. బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను కేంద్రంలోని బీజేపీయే రంగంలోకి దించిందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఓటర్లలో విభజనలు తెచ్చేందుకే ఆయన ప్రయతి్నస్తున్నారన్నారు. ‘దేశంలోని ముస్లింలను ఎలా చూస్తున్నారో ఆయనకు తెలుసు. అదే వైఖరిని ఇక్కడా తేవాలని బీజేపీ ప్రయతి్నస్తోందన్న విషయం రషీద్ గ్రహించడం లేదు. చివరికి ఆయనకు కూడా అదేగతి పట్టొచ్చు. రషీద్‌ను చూస్తే జాలేస్తోంది.’అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన..బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని పేర్కొన్నారు. చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం ‘ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉంది. దీనిని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రజలందరినీ మనతో కలుపుకుని ముందుకు వెళ్లడం’అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చలు మేలన్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తే పురోగమిస్తాం, వేగంగా ముందుకు సాగుతాం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై డబ్బు ఖర్చు చేయడం కంటే మన ప్రజలను మరింత అభివృద్ధి చేయడం ఉత్తమం. ఈ విషయంలో సార్క్‌ను బలోపేతం చేయాలి. భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు సాగించలేకుంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగుతాయి’అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఎన్నికలకు విదేశీ ప్రతినిధులు రావడంపై ఆయన..కశ్మీర్ భారత్‌లో భాగమని వారనుకుంటున్నారా? భారత్‌లో మేం భాగమే అయితే, కశ్మీర్‌కు మాత్రమే వాళ్లు ఎందుకొస్తున్నట్లు? హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్లరు?’అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్న ప్రభుత్వం..విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు పెడుతోంది. నిజాలు బయటకొస్తాయని కేంద్రం భయపడుతోంది’అని వ్యాఖ్యానించారు. -
ఆ పేరు వినబడితే చాలు.. వెన్నులోంచి వణుకొస్తుందట!!
గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్ మర్రిచెట్టు’ ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.‘మే డి డ్యూస్’ క్యాథలిక్ చర్చ్‌కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.ఆ ఏడాది చివరిలో సాలిగావ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్ ఫాదర్.. మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్‌లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్‌కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్‌లో చూడొచ్చట!
ఆత్మల గురించి కథలు కథలుగా వినడం లేదా సినిమాల్లో చూడటమే. గాన్నీ ప్రత్యక్షం చూసిన అనుభవం ఎవరికీ ఉండదు. మహా అయితే దేన్నో చూసి ఊహించుకుని భయపటమే జరగుతుంది. ఈ గుహలోకి వెళ్తే ఆ కోరక తీరిపోతుందట. ఏంటీ..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగా ఆత్మలను ప్రత్యక్ష్యంగా చూడాలనుకునేవాళ్లు నేరుగా ఈ గుహలోకి వెళ్లిపోతే ఆ ఫీలింగ్ దక్కుతుందట. పైగా ఆ అనుభవాన్ని అంత తేలిగ్గా మరిచిపోలేరట కూడా. ఆ గుహ ఎకడుందంటే..? ఇదేదో మామూలు కొండగుహ కాదు, దయ్యాల నిలయం. ఫిన్లండ్‌లోని కోలి అభయారణ్య ప్రాంతంలో ఉన్న ఈ గుహను స్థానిక ఫిన్నిష్ భాషలో ‘పిరున్కిర్కో’ అంటారు. అంటే, దయ్యాల ఆలయం అని అర్థం. ప్రేతాత్మల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వచ్చి, ఈ గుహలో కాసేపు గడిపి వెళుతుంటారు. ఈ గుహలోకి అడుగుపెట్టిన తర్వాత గుహలో ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి కలిగినట్లు ఇందులోకి వెళ్లి వచ్చిన చాలామంది చెప్పారు. ఇందులోకి అడుగు పెట్టగానే ఎవరో అదృశ్యంగా తాకుతున్న అనుభూతి కలిగిందని, చెవిలో ఎవరో గుసగుసలు చెబుతున్నట్లుగా అనిపించిందని పలువురు చెప్పారు. గుహలో ఎవరో రోదిస్తున్న ధ్వని వినిపించినట్లుగా కూడా కొందరు చెప్పారు. ఈ గుహ లోపలి పొడవు 34 మీటర్లు ఉంటుంది. అంతా ఖాళీగా, చీకటిగా ఉంటుంది. ఈ గుహలోని ఆత్మ గురించి ఫిన్లండ్‌లో చాలా కథలు శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇందులోకి వెళ్లేవారికి అక్కడ ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి ఎందుకు కలుగుతోందనే దానిపై నిగ్గు తేల్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఫిన్లండ్ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనలు ప్రారంభించారు. (చదవండి: ఆ ఫౌంటెన్ కోసం ఏకంగా రూ. 16 కోట్లు ..! కానీ చివరికి..) -
మిస్టీరియస్ డెవిల్స్ బ్రిడ్జ్..
-
వామ్మో దెయ్యాల ఊళ్లు.. ఆ ఇళ్లలో ప్రేతాత్మలు ఉన్నాయా?.. అక్కడికి వెళ్లాలంటే?
ఆ ఊళ్లో ఎటుచూసినా చెదురు మదురుగా విసిరేసినట్లుండే భూత్ బంగ్లాలే కనిపిస్తాయి. వీధుల్లో తిరుగుతుంటే, అక్కడక్కడా పాడుబడిన వాహనాలు కనిపిస్తాయి. ప్రపంచంలో అక్కడక్కడా అరుదుగా కనిపించే దెయ్యాల ఊళ్లుగా పేరుమోసిన ఊళ్లలో ఆ ఊరొకటి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటారా? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఊరి పేరు బోడీ. ఇదొక చిన్న పట్టణం. రెండువందలకు పైగా ఇళ్లు, చర్చిలు, పాడుబడిన సెలూన్లు, జూదశాలలు, వినోదకేంద్రాలు, హోటళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే, ఈ ఊళ్లో మనుషులెవరూ ఉండరు. అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చిపోతుంటారు. పర్యాటకులు బస చేయడానికి ఇక్కడా ఎలాంటి వసతులూ ఉండవు. బాగున్న రోజుల్లో ఈ ఊరి జనాభా పదివేలకు పైగానే ఉండేది. ఊరికి దగ్గరగానే బంగారు గని ఉండేది. గనిలో పనిచేసేవాళ్లంతా ఈ ఊళ్లో ఉండేవాళ్లు. ఊరే కాదు, ఊరవతల ఉండే బంగారు గని కూడా ఇప్పుడు ఖాళీగా మిగిలింది. దెయ్యాల భయంతోనే జనాభా అంతా ఈ ఊరిని విడిచిపెట్టి తలోదిక్కూ వెళ్లిపోయారు. డెబ్బయ్యేళ్ల కిందట ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇంకెవ్వరూ ఇక్కడకు వచ్చి స్థిరపడే ప్రయత్నం చేయకపోవడంతో 1962లో కాలిఫోర్నియా ప్రభుత్వం దీనిని ‘బోడీ స్టేట్ హిస్టారిక్ పార్క్’గా మార్చింది. గుండెధైర్యం ఉన్న పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వస్తుంటారు. వారిలోనూ కొందరు ఇక్కడ కొన్ని పాడుబడిన ఇళ్లలో ప్రేతాత్మలు చూశామని, కొన్ని ఇళ్ల నుంచి పిల్లలు ఆడుకుంటున్న చప్పుళ్లు విన్నామని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. పాడుబడిన ఇళ్లలో అప్పటి జనాలు వాడుకున్న ఫర్నిచర్, ఇతర వస్తువులు దుమ్ముపట్టి ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ ఊరిని సందర్శించడానికి పగటి వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. రుతువును బట్టి సందర్శకులను అనుమతించే వేళల్లో మార్పులు ఉంటాయి. -
ఔను! ఆ పబ్‌లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో
CCTV camera captures pen moving on its own: ఇటీవల ఒక ప్రోఫెసర్ దెయ్యాలు ఉన్నాయి అంటూ తెగ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత యూఎస్‌లో ఒక పార్క్‌లో దెయ్యం కూర్చోని ఉంటుందటూ భయపడితే అదేంటో అంతు తేల్చడానికి వెళ్లిన వాళ్లు అది ఒక షాప్‌లో ఉండే బొమ్మ అని చెప్పి సందేహాన్ని క్లియర్ చేశారు. కానీ యూకేలోని పబ్‌ని చూస్తే ఇప్పుడూ కచ్చితంగా మీరు నిర్ణయం మార్చుకుంటారు. పైగా సీసీఫుటేజ్‌లో రికార్డు అయిన వాటిని చూస్తే మాత్రం ఔనును దెయ్యలు ఉన్నాయని అనుకుండా ఉండలేరు. అసలు విషయంలోకెళ్తే...యూకేకి చెందిన రిచెల్ స్టాక్స్, ఆష్లీగ్ నైస్బిట్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు డార్లింగ్టన్లోని మార్పెత్లో బ్లాక్ అండ్ గ్రే పబ్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత నంచి వారే ఆ పబ్‌ని నడపడం మొదలు పెట్టారు. అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. పబ్‌లో వింత వింత శబ్దాలు రావడం, వస్తువులన్నీ వాటంతట అవే కదలడం జరిగింది. దీంతో ఆ పబ్‌లో పనిచేసే సిబ్బంది సైతం విధులకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. అంతేకాదు ఆ అక్కాచెల్లళ్లు పబ్‌లోని మెట్లమీద నుంచి నడుస్తుంటే ఏవో వింత శబ్దం వచ్చిందని, పైగా సెల్లార్‌కి వెళ్లాలన్న భయంగా ఉందని పేర్కొన్నారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు ఆ పబ్‌ని తనిఖీ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ఈ అక్కా చెల్లెళ్లు పోలీసుల ముందే దెయ్యాలు ఉన్నాయని చూపించేందుకు ఒక సాహసం చేశారు. ఈ క్రమంలో వాళ్లు ఒక పెన్ని చేతిలో పెట్టుకుని ఇక్కడ ఎవరైన ఉంటే ఈ పెన్నుని కదిలించండి అన్నారు. అంతే కాసేపటికి నిజంగానే ఆ పెన్ను దానంతటే అదే కదిలింది. దీంతో భయంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఆ పబ్‌లోని సీసీఫుటేజ్‌ని పరిశీలించి చూస్తే ...నిజంగానే ఏవో వింత ఆకారాలు, మనిషి నీడలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైయ్యారు. అంతేకాదు ఈ సీసీఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ధైర్యం ఉంటే మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: బిగ్గరగా మాట్లాడుతోందని ఆ లెక్చరర్‌ను ఏం చేశారంటే?) -
ఇదేం పిచ్చో.. బాల్కనీ అంతా దెయ్యం బొమ్మలతో నింపేశాడు!
బొమ్మలతో మనం మాట్లాడితే పర్వాలేదు. అవే బొమ్మలు మనతో మాట్లాడితే భయపడక తప్పదు. ఇలా బొమ్మలతో భయపెట్టే సినిమాలు ఎన్నో! విచిత్రంగా ఓ సామాన్యుడు కూడా బొమ్మలతో భయపెట్టిస్తున్నాడు. నిజానికి అతని ఉద్దేశం వేరే అయినా స్థానికులు మాత్రం అతని ఇంటిలోపలికి కాదుకదా కనీసం కింద నుంచి బాల్కనీ వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. వెనెజులా రాజధాని కారకస్‌కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ ఎటాన్లస్ గోన్‌సాల్వెజ్‌కు ఓ డ్రైవర్‌తో మంచి స్నేహం ఉండేది. అతని కారులో ఎప్పుడూ బొమ్మలు ఉండేవి. అది చూసిన గోన్సాల్వెజ్ కొడుకు తనకు కూడా ఇలా బొమ్మలను ఒక చోట సెట్ చేయమని కోరాడు. దీంతో, గోన్సాల్వెజ్ మూడేళ్లపాటు శ్రమించి బాల్కనీ నిండా బొమ్మలతో విచిత్రంగా నింపాడు. అయితే, ఆ బొమ్మల బాల్కనీ చూసిన కొడుకు సంతోషించినా, స్థానికులు మాత్రం కలవరపడుతున్నారు. అచ్చం దెయ్యం బొమ్మల్లా కనిపించే వాటిని చూసి, అతనేదో క్షుద్రపూజలు చేస్తున్నాడని, వాటిని తీసేయాల్సిందే అంటూ గొడవకు దిగారు. ఇలా కొన్ని నెలలపాటూ ఈ బొమ్మలపై గొడవ జరిగింది. ఏం చేసినా గోన్సాల్వెజ్ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానికులే సైలెంటైపోయారు. దీంతో, ప్రస్తుతం ఈ బొమ్మల బాల్కనీ అక్కడ ఓ ల్యాండ్ మార్క్‌గా మారింది. కొంతమంది కేవలం ఆ బాల్కనీని చూడ్డానికి అదేపనిగా వస్తున్నారు. ప్రస్తుతం అతను ఇంటిలోనికి అనుమతించడటం లేదు కానీ, కింద నుంచి చూసే అవకాశం మాత్రం ఉంది. -
పోలీస్‌స్టేషన్‌లో దెయ్యాలు?
పోలీసులంటే సామాన్య ప్రజలకు హడల్. అటువంటి పోలీసులకే నిద్రలేకుండా చేస్తున్నాయట ఆత్మలు. నేటి డిజిటల్ యుగంలోనూ ఇలాంటివేమిటని కొట్టిపారేయకండి. తుమకూరు జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్లో దయ్యాల సంచారం ఖాకీలకు, ప్రజలకు భీతిగొలుపుతోంది. తుమకూరు : తుమకూరు జిల్లాలోని శిర తాలూకాలోని 4వ జాతీయ రహదారిపై ఉన్న కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్‌ను దెయ్యాల భయం ఆవహించింది. స్టేషన్‌లోని సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలిస్తున్న పోలీసులు అందులో రెండు ఆకారాలు స్టేషన్ ఆవరణలో సంచరించడం చూసి భయంతో వణికిపోయారు. బూడిద రంగులోని చుక్కల వంటి ఆకారాలు స్టేషన్ లోపలికి, బయటకు తిరగడం వీడియోలో కనిపించింది. ఆ సీసీ కెమెరా వీడియోలు, ఫోటోలు ఇప్పుడు టీవీ చానెళ్లలో ప్రసారం కాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తరచూ రోడ్డు ప్రమాదాలు కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రతి రోజూ ప్రమాదాల్లో కనీసం ఇద్దరైనా మృత్యువాత పడుతుంటారు. గతంలో కూడా పలు ఘోరమైన రోడ్డు ప్రమాదాలో కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి లభించని ఆత్మలు దెయ్యాలై పోలీస్‌స్టేషన్‌లో తిరుగుతున్నాయంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. దెయ్యాలున్నట్లు వదంతులు వ్యాపించడంతో రాత్రి వేళల్లో స్టేషన్ చుట్టుపక్కలకు రావడానికి ప్రజలు భీతిల్లుతున్నారు. రాత్రి వేళల్లో స్టేషన్లో పనిచేయడానికి స్టేషన్ సిబ్బంది కూడా జంకుతున్నారు. దయ్యాలను పారదోలడానికి ఏం చేయాలా అని పోలీసులు ఆలోచిస్తున్నారు. -
ఊళ్లో దెయ్యం.. మాకెంతో భయం!
ఊళ్లో దెయ్యం ఉందంటూ కొందరు ఊరినే ఖాళీ చేశారు. ఇటీవల కొన్ని నెలలుగా ఒకే గ్రామానికి చెందిన పలువురు ఎలాంటి రోగాల బారిన పడకుండానే మృతి చెందారు. ఇలా ఎందుకు జరుగుతోంది.. మా ఊరికి ఏమైంది? చేతబడి జరుగుతోందా? లేక దెయ్యమే ఉందా? అంటూ గ్రామస్తులు ఆందోళన చెందారు. చివరికి దెయ్యమే ఉందని నిర్ధారణకొచ్చి.. ఊరినే ఖాళీ చేసిన సంఘటన సీఎం కేసీఆర్ స్వగ్రామం శివారు ఉప్పలోనికుంటలో వెలుగుచూసింది. సిద్దిపేట రూరల్: దెయ్యం భయంతో సిద్దిపేట రూరల్ మండలంలోని సీఎం కేసీఆర్ సొంతూరు శివారులోని ఉప్పలోనికుంట గ్రామస్తులు ఊరు ఖాళీ చేసిన విషయం చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలోని రాందేవి అనే ఒకే వంశానికి చెందిన వారు పొలాల వద్దే స్థిర నివాసాలు ఏర్పరచుకొన్నారు. గ్రామంలో మొత్తం వీరివి 20 కుటుంబాలు. అయితే వరుసగా ఆ కుటుంబాల్లో మరణాలు జరుగుతుండటంతో చాలా కుటుంబాలు గ్రామాన్ని వదిలి వలస వెళ్లిపోయాయి. దీంతో చాలావరకూ ఇళ్లు తాళాలు వేసి, వ్యవసాయ భూములు బీడులుగా మారి గ్రామం బోసిపోయినట్లు కన్పిస్తుంది. ఇప్పుడు.. గ్రామంలో రాందేవి వంశానికి చెందిన మూడు కుటుంబాల వారు మాత్రమే వ్యవసాయం చేసుకుంటూ సాయంత్రానికే తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. ఇదంతా మూడేళ్ల నుంచే మూడేళ్ల క్రితం రాందేవి భారతి అనే మహిళ చనిపోయింది. అప్పటినుంచి గ్రామంలో ప్రతీ 4 నెలలకు ఒకరు ఎలాంటి అనారోగ్యం లేకుండానే చనిపోతున్నారు. పరీక్ష రాసేందుకు సిద్ధమైన ఓ విద్యార్థిని సైతం తెల్లవారుజామున నిద్రలోనే మరణించింది. ఇటీవల అస్వస్థతకు గురైన ఓ వ్యక్తిని, వింత చేష్టలు చేస్తున్న మరోవ్యక్తిని వైద్యులకు చూపించారు. డాక్టర్లు పరీక్షలు చేసి వారు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. దీంతో గ్రామస్తులందరూ భూతవైద్యులను ఆశ్రయించారు. దెయ్యం కారణంగానే వీరంతా మరణిస్తున్నారని చెప్పడంతో ఆ గ్రామంలో పూజలు చేయించారు. అయినప్పటికీ మరణాలు ఆగకపోవటంతో గ్రామస్తులందరూ ఊరిని, పొలాలను వదిలి.. చింతమడక, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. రోడ్డున పడ్డాం.. గ్రామంలో మా వంశానికి చెందిన వారందరూ ఎలాంటి కారణాలు లేకుండా చనిపోవడంతో మాకు భయం వేసి చింతమడకలోనే ఉంటున్నాం. భూమిని వదిలిపెట్టడంతో ఉపాధి లేక రోడ్డున పడ్డాం. – రాందేవి నర్సింహులు, ఉప్పలోనికుంట అద్దె ఇంట్లో ఉంటున్నాం.. దెయ్యం ఉందన్న కారణంతో గ్రామం నుంచి వలస వచ్చేశాను. నా నాలుగు ఎకరాల భూమిలో పగలే వ్యవసాయం చేస్తున్నాను. దెయ్యం భయంతో సాయంత్రానికే తిరిగి వస్తున్నాను. – రాందేవి వెంకటయ్య. ఉప్పలోనికుంట -
ఇదేం దెయ్యం గోల..!
పార్వతీపురం స్వీపర్ వీధిలో దెయ్యం వదంతులు తమను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ కుటుంబం పార్వతీపురం: ఇదేమి దెయ్యం గోలరా బాబూ అంటూ శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పట్టణ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల పట్టణంలోని స్వీపర్ వీధికి చెందిన ఓ కుటుంబం తమను స్థానికులు దెయ్యం పేరుతో వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి వెంటనే స్పందించిన పట్టణ ఎస్ఐ బి.సురేంద్రనాయుడు స్వీపర్ వీధిలో సమావేశం నిర్వహించి అక్కడ ప్రజలను దెయ్యం...లేదంటూ వారిని చైతన్య పరిచేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ప్రజలు దెయ్యం పెట్టే బాధలు మీకేం తెలుసంటూ ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. ఒడిశాకు చెందిన ముగ్గురు పిల్లలు కలిగిన ఓ మహిళను కాలిన గాయాలతో పట్టణంలోని స్వీపర్ వీధికి ఓ కుటుంబం తీసుకొచ్చింది. గాయాల కారణంగా నెలరోజుల క్రితం ఆమె మృతిచెందింది. అయితే ఆమె చనిపోయాక కొందరు వీధివాసులపై పడి తమ పిల్లలను అప్పగించాలని రాత్రిపూట భయాందోళనకు గురిచేస్తోందని స్థానికుల్లో పుకారు వ్యాపించింది. దీంతో ఆ వీధివాసులు మహిళ మృతిచెందిన కుటుంబ సభ్యులకు దెయ్యం రాకుండా భూతవైద్యుడ్నితెచ్చి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా సూచించారు. అయితే తమ పిల్ల మంచిదని దెయ్యాలు.. భూతాలు ఉండవని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తమను వేధిస్తున్నారనే ఆవేదనతో పట్టణ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సురేంద్రనాయుడు స్వీపర్ వీధిలో దెయ్యం లేదంటూ ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. -
దయ్యాలకు చదువొస్తుందా...
మహబూబ్‌నగర్: ఈ గ్రామంలోని ఓ కాలనీలో ఏ ఇంటి ముందు చూసినా ‘ఓ స్త్రీ రేపురా..’అని బొగ్గుతో రాసి ఉంది. గత రెండు రోజులుగా కాలనీలో రాత్రిపూట మహిళదయ్యం తిరుగుతోందట. మహిళ స్వరం, ఏడుపుశబ్ధంతో మధ్యరాత్రి దయ్యం తిరుగుతోందని కాలనీవాసులు భయపడుతున్నారు. రాత్రి 8గంటలకే ఇళ్లకు గొళ్లం వేసుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతున్నారు. బయటికి చెప్పాలన్నా దయ్యం ఏంచేస్తుందోనని మరింత భయపడుతున్నారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండల పరిధిలోని తుంకిమెట్లలోని 4వవార్డు తెలుగుగడ్డ (చిక్కలిగేరి)లో ఇంటిపైన రెండవ అంతస్తులో ఓ మహిళకు శుక్రవారం అర్ధరాత్రి తన ఇంటి వెనక ఉన్న విద్యుత్ స్తంభం వద్ద మహిళ ఏడుస్తున్నట్లు శబ్ధం వినిపించింది. బయటకు వచ్చి చూసింది. కుక్కలు మొరుగుతూ శబ్ధం వచ్చిన చోటే చుట్టుముట్టాయని మహిళ చెబుతుంది. కొద్దిసేపటికీ మహిళ ఏడుపు శబ్ధం ఆగిపోయి, కుక్కలు మొరగడం ఆపివేశాయని చెబుతున్నారు. కొద్దిసేపటికీ దయ్యం ఉండవచ్చనని మహిళ భయపడింది. దీంతో తెల్లారేసరికీ మహిళకు జ్వరం వచ్చింది. ఇది తెలిసిన కాలనీవాసులంతా భయాందోళనకు గురయ్యారు. కాలనీలో దయ్యం భయం చుట్టుకుంది. ఇంటి ముఖద్వారం గోడలకు ‘ఓ స్త్రీ రేపురా..’అంటూ రాసుకున్నారు. శనివారం రాత్రి మరో మహిళకు.. మహిళస్వరంతో బాధగా ఆయాసంగా మూలుగుతూ ఉన్నట్లు శబ్ధం వినపడిందట. దీంతో తమ కాలనీలో రాత్రి పూట దయ్యం తిరుగుతోందిని, దయ్యం ఇంటి వద్దకు వచ్చి పిలుస్తుందని భావిస్తున్నారు. దీనిపై గ్రామంలో ‘దయ్యం’ భయాన్ని పోగొట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. దయ్యానికి చదువొచ్చా..? రాత్రిపూట దయ్యం తిరుగుతోందని, ఇంటి వద్దకు వచ్చిన దయ్యం బయటినుంచే వెళ్లిపోవాలని భావించి ఇంటి గోడలకు రాసుకుంటున్న ‘ఓ స్త్రీ రేపురా..’ రాతలు చూసి విద్యావంతులు, హేతువాదులు అవాక్కవుతున్నారు. రాసిన అక్షరాలను చదువుకొని తిరిగి వెళ్లాలంటే దయ్యానికి చదువు వొచ్చా, వస్తే దయ్యానికి చదువు ఎవరు నేర్పారు? ఏబడిలో చదివిందో చెబుతారా? అంటూ దయ్యం మూఢనమ్మకాన్ని వెక్కిరిస్తున్నారు. -
దెయ్యాలంటూ.. అర్ధరాత్రి హల్చల్
హైదరాబాద్ : 'ఇది బూత్బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి' అంటూ అర్ధరాత్రి సమయంలో ఓ బంగ్లా వద్దకు వచ్చి హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంత మంది యువకులు సోమాజిగూడ కుందన్‌బాగ్‌లోని ఓ పురాతన భవనం వద్దకు ఫొటోలు తీసుకున్నారు. వాటిని ఫేస్బుక్, వికీపీడియా యూట్యూబ్‌ల్లో పెట్టారు. 'ఇది బూత్బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి. ఎవరికైనా దమ్ముంటే అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లోకి వెళ్లాలి' అంటూ సవాల్ విసురుతున్నారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లోకి వెళ్లి బిగ్గరగా అరవడం, రాళ్లతో కొట్టడం, బాటిల్స్ విసరడం వంటివి చేస్తున్నారు. మరో ఇంట్లో ఉంటున్న ఆ ఇంటి యజమాని శారద ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి అక్కడ హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు సోమవారం వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మళ్లీ ఇంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని ఆ యువకులతో ప్రమాణం చేయిం చారు. కాగా, ఆ బంగ్లాలో ఎలాంటి దుష్టశక్తులు లేవని, భయాందోళనకు గురికావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
దెయ్యాలపై పరిశోధన
శ్రీ మహేశ్వరి పరమేశ్వరా క్రియేషన్స్ పతాకంపై నజీరానూరి సమర్పణలో చాంద్ పాషా దర్శకత్వంలో బేగం, ఖాదర్‌బాబు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆనంద్‌కుమార్, రాజా, కార్తీక్, ‘రోషం’ బాలు, అనూష, స్వప్న ముఖ్య తారలు. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి దేవీప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, సాయి వెంకట్ క్లాప్ ఇచ్చారు. వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘దెయ్యాలున్నాయా? అనే అంశంపై ముగ్గురు విద్యార్థులు పరిశోధన చేసి, బంగారు పతకం సాధిస్తారు. దెయ్యాలున్నాయని తేలిందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు. ఇది రొమాంటిక్ హారర్ మూవీ అని, 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. సన్నీ, కెమెరా: ఆనంద్ శ్రీరామ్, సహనిర్మాత: సల్మాన్‌ఖాన్. -
పిల్లులు, కుక్కలకు ‘దివ్య’దృష్టి!
కుక్కలకు, పిల్లులకు దెయ్యాలు కనిపిస్తాయనీ.. ఆవుకు కొన్ని విషయాలను పసిగట్టే శక్తి ఉంటుందనీ.. అనేక మంది విశ్వసిస్తారు. అయితే పిల్లులకు, కుక్కలకు, ఎలుకలకు నిజంగానే ‘దివ్య’దృష్టి ఉంటుందంటున్నారు సిటీ యూనివర్సిటీ లండన్ శాస్త్రవేత్తలు. మనుషుల కంటికి కనిపించని అతినీల లోహిత కాంతి(యూవీ లైట్)ని సైతం పిల్లులు, కుక్కలు, ఎలుకలు, గబ్బిలాలు, ఇంకా వివిధ క్షీరదాలు చక్కగా చూడగలుగుతాయని వారు తేల్చారు. వెన్నెముక లేని తేనెటీగ వంటి జీవులు, పక్షులు, చేపలు, కొన్ని సరీసృపాలు, ఉభయచరాలు యూవీ కాంతిని చూడగలుగుతాయని గతంలోనే తేలింది. అయితే యూవీ కాంతిని గ్రహించి ఆ సమాచారాన్ని విద్యుత్ప్రేరణల రూపంలో నాడీకణాలకు సరఫరా చేసే విజువల్ పిగ్మెంట్లు (వర్ణకాలు) క్షీరదాల వంటి జంతువుల కళ్లలో లేకపోవడం వల్ల అవి ఆ కాంతిని చూడలేవని శాస్త్రవేత్తలు భావించారు. కానీ అతినీలలోహిత కాంతిని చూసేందుకు ఈ పిగ్మెంట్లు అత్యవసరం కాదని తమ పరిశోధనలో తేలినట్లు సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని జంతువుల్లో కార్నియా (నేత్రపటలం) కూడా యూవీ తరంగాలను ప్రసారం చేయగలదని, దీంతో యూవీ కాంతి రెటీనాను చేరి అవి చూడగలవని వారు అంటున్నారు. పిల్లులు, కుక్కలు అతినీలలోహిత కాంతిని చూడగలిగినా.. ఆ కాంతి ఎక్కువైతే వాటికి హానికరమేనట. అంతేకాదండోయ్.. అతినీలలోహిత కాంతితో చిత్రాలు చాలా మసక(బ్లర్)గా కనిపిస్తాయట. మన కంట్లో యూవీ కాంతిని తొలగించి మామూలు కాంతిని మాత్రమే స్వీకరించే కటకం ఏర్పడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే.. మనకు ప్రపంచం అంతా మసకేసేదేమో! -
కనిపిస్తే ఉన్నట్లేనా !
దెయ్యాలు లేవన్నది నిజమైతే... మనిషికి ఇంకా వాటిపట్ల భయమెందుకుంది? దెయ్యాలు ఉండేది నిజమే అయితే... వాటి ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగానే ఎందుకుంది? వీటికి కచ్చితమైన సమాధానాలు ఎవరి దగ్గరైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ... దెయ్యాలు ఉన్నాయనడానికి చరిత్రలో పేజీలకు పేజీలు కథనాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ దెయ్యం ఉనికి పట్ల సందేహాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. అందుకే లలోరీ హౌస్‌లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది ఇప్పటికీ తేలలేదు. ఇంతకీ లలోరీ హౌస్ ఎక్కడుంది? దాని వెనుక ఉన్న కథేంటి? న్యూ ఆర్లియన్స్, అమెరికా. టెన్షన్‌గా ఉన్నాడు డేవిస్. కోపంగా కూడా ఉన్నాడు. రోజూ రాత్రి తన ఫర్నిచర్ షాపు కట్టేసి వెళ్లిపోగానే ఎవరో లోపల దూరుతున్నారు. రోజుకో వస్తువు చెల్లాచెదురు చేస్తున్నారు. మొదట ఏదో దొంగలముఠా పని అయి ఉంటుందనుకున్నాడు. కానీ ఏ వస్తువూ పోవడం లేదు. పైగా వెళ్లేటప్పుడు తాళం పెట్టి పోతున్నారు. అంటే కచ్చితంగా తన షాపులో పని చేసేవాళ్ల పనే అయి ఉంటారని అర్థమైంది. ఎలాగైనా ఆరోజు వారి ఆట కట్టించాలని నిర్ణయించుకున్నాడు డేవిస్. రాత్రయ్యాక అందరినీ పంపించేశాడు. తర్వాత తన ఇంట్లో పనిచేసే వాళ్లను రమ్మని చెప్పి, తనని లోపలుంచి బయట తాళం పెట్టి, ఎక్కడైనా కనబడకుండా నిలబడమన్నాడు. విజిల్ ఊదుతానని, అప్పుడు వచ్చి వాళ్లని పట్టుకోవాలని చెప్పాడు. వాళ్లు సరేనని చెప్పి, తాళం పెట్టిపోయారు,లైట్లన్నీ ఆర్పేసి, తలుపు పక్కన ఉన్న చిన్న బెడ్‌లైట్ లాంటిది మాత్రం వేసి, ఓ మూలన నక్కాడు డేవిస్. క్షణాలు... నిమిషాలు... గంటలు గడిచాయి. సమయం పన్నెండు గంటలయ్యింది. తలుపు దగ్గర ఏదో చప్పుడు. వచ్చేది ఎవరా అని తలుపు వైపే చూస్తున్నాడు డేవిస్. ఓ వ్యక్తి లోనికి ప్రవేశించాడు. అతణ్ని చూస్తూనే కెవ్వున కేక పెట్టబోయి తమాయించుకున్నాడు డేవిస్. ఎందుకంటే, అతడికి రెండు చేతులూ లేవు. అంతలోనే ఓ స్త్రీ వచ్చింది. ఆమెను చూడగానే అదిరిపడ్డాడు. తెల్లని గౌను వేసుకుని, జుత్తు విరబోసుకుందా స్త్రీ. ముఖం తెల్లగా పిండి పూసినట్టుగా ఉంది. కళ్లు ఎర్రగా రక్తమోడుతున్నట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చాడు. అతడికసలు తలే లేదు. మొండెమే నడచుకుంటూ వస్తోంది. వాళ్లంతా తలుపు తీసుకుని రావడం లేదు. తలుపులోంచి దూసుకొస్తున్నారు. పై ప్రాణాలు పైనే పోయాయి డేవిస్‌కి. వణుకుతున్న చేతులతో విజిల్‌ని నోటిలో పెట్టుకున్నాడు. దాన్ని ఊదుతూనే కళ్లు తిరిగి పడిపోయాడు. మెలకువ వచ్చేసరికి తన ఇంట్లో ఉన్నాడు డేవిస్. అందరూ తనవైపే విచిత్రంగా ఉండటం చూసి ఏమైందో అర్థం కాలేదతడికి. రాత్రి విజిల్ వినిపించి తలుపు తీసుకుని లోనికి వచ్చామని, స్పృహ తప్పిన తనని ఇంటికి తీసుకొచ్చామని పనివాళ్లు చెప్పాడు. అప్పుడుగానీ రాత్రి జరిగింది గుర్తు రాలేదు. భయంతో గుండె దడదడలాడింది. అంతే... వారం తిరిగేలోపు షాపుని అమ్మేశాడు. అసలు డేవిస్ చూసింది ఎవరిని? ఆ వింత రూపాలు అక్కడికెలా వచ్చాయి? వీటికి సమాధానాలు తెలియాలంటే 1832వ సంవత్సరానికి వెళ్లాలి. లలోరీ హౌస్... అమెరికాలోని న్యూ ఆర్లియన్స్‌లో ఉన్న ఈ భవనం గురించి తెలియనివాళ్లు లేరు. 1832లో ఓ రోజు... డాక్టర్ లూయిస్ లలోరీ తన భార్య డెల్ఫైన్ని, పిల్లల్ని తీసుకుని క్రియోల్లోని ఓ మ్యాన్షన్‌కి వచ్చాడు. అప్పట్నుంచీ అందరూ దాన్ని లలోరీ హౌస్ అని పిలవడం మొదలుపెట్టారు. డాక్టర్ లూయిస్ నెమ్మదస్తుడు. తన పనేంటో తాను చేసుకుపోయేవాడు. అయితే అతడి భార్య డెల్ఫైన్ అలా కాదు. ఎప్పుడూ సందడిగా ఉండేది. అందరినీ పలకరిస్తూ, సరదాగా ఉండేది. అందుకే అందరూ ఆమె పరిచయం కోసం ఉవ్విళ్లూరేవారు. అంతగా ఆమె ఫేమస్ అయిపోయింది. అయితే డెల్ఫైన్లో మరో మనిషి ఉందని ఎవరికీ తెలియదు. ఆ మరో మనిషి ఎలాంటిదో తెలిశాక... ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఓ రోజు లలోరీ హౌస్‌కి పక్క భవనంలో నివాసముంటోన్న ఓ మహిళ... తన ఇంటి మేడ మెట్లెక్కుతోంది. అంతలో లలోరీ హౌస్ నుంచి చిన్నపిల్ల ఆర్తనాదం వినిపించింది. కంగారు పడిన ఆ మహిళ అటు చూసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. డెల్ఫైన్ ఓ పిల్లని తరుముతోంది. తను ఏడుస్తూ పరిగెత్తుతోంది. పరుగెత్తి పరుగెత్తి మేడమీదికి చేరింది. ఇక ఎటు పోవాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడింది. ఆ పిల్ల దగ్గరకు వచ్చింది డెల్ఫైన్. వికృతంగా నవ్వి, పాపను మేడమీది నుంచి తోసేసింది. తర్వాత పనివాళ్లు ఆ పిల్ల శవాన్ని ఇంటి వెనుక ఉన్న తోటలోకి తీసుకెళ్లి కాల్చేయడం చూసి నిలువెల్లా వణికిపోయిందామె. తన ఇంట్లోవాళ్లకి విషయం చెప్పింది. కన్ను మూసి తెరిచేలోగా విషయం అంతటా పాకిపోయింది. అందరూ కలిసి ఆ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకున్నారు. అంతలోనే ఓ రోజు లలోరీ హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వంటగది నుంచి మంటలు చెలరేగడంతో హాహాకారాలు మొదలయ్యాయి. ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్లంతా ఇంటిముందు గుమిగూడారు. పోలీసులు సైతం చేరుకున్నారు. మెయిన్ గేటు మూసి ఉండటంతో తీయమంటూ కేకలు వేశారు. కానీ లోపలి నుంచి ఎవరూ రాలేదు. కాసేపటి తర్వాత ఓ నల్లటి వాహనం లోపలి నుంచి దూసుకొచ్చింది. గేటు విరిగిపడేంత వాయువేగంతో వెళ్లిపోయింది. క్షణాల్లో కనుమరుగయ్యింది. పోలీసులు లోనికెళ్లారు. ఎవరైనా ఉంటే పట్టుకోవాలని వెతికారు. లోపల చాలామంది ఉన్నారు. అయితే వాళ్లు లలోరీ కుటుంబానికి చెందినవారు కాదు. వారి చేతుల్లో చిత్రహింసలకు గురై, చావలేక బతకలేక మిగిలున్న జీవచ్ఛవాలు. కొందరికీ కాళ్లూ చేతులూ లేవు. కొందరికి కళ్లు లేవు. కొందరికి నాలుకలు, ఇంకొందరికి మర్మాంగాలు కోసేశారు. గోళ్లు పీకేశారు. ఒంటి నిండా వాతలు పెట్టారు. ఓ మహిళ పరిస్థితి చూసి పోలీసులు సైతం షాక్ తిన్నారు. అతి చిన్న చెక్కపెట్టెలో బలవంతంగా ఆమె శరీరాన్ని కుక్కారు. దాంతో ఆమె ఎముకలు ఫెళఫెళ విరిగిపోయాయి. చాలాకాలం పాటు కదలకుండా అలానే ఉండటంటే... విరిగినవి విరిగినట్టుగానే అతక్కుపోయి ఆమె శరీరం విచిత్రంగా తయారయ్యింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారక్కడ. కొందరు మాట్లాడలేకపోతున్నారు. కొందరు మాట్లాడటమే మర్చిపోయారు. కాస్తో కూస్తో నోరు మెదపినవారు చెప్పిన వివరాలు విని అందరికీ ఒళ్లు జలదరించింది. డెల్ఫైన్ ఒక నరరూప రాక్షసి. పనికి మనుషుల్ని రప్పించుకునేది. బానిసల్ని చేసి బంధించేది. చిన్న తప్పు చేసినా పెద్ద పెద్ద శిక్షలు వేసేది. తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తే ఇంటి వెనుక పూడ్చిపెట్టేది. లేదంటే కాల్చి బూడిద చేసేది. దాంతో కడుపు మండిన ఓ పనివాడు వంటగదిలో కావాలని నిప్పుపెట్టాడు. అతడు చేసిన ఆ పని... డెల్ఫైన్ దారుణాలను బయటపెట్టింది. పోలీసులు లలోరీ హౌస్‌కు తాళం పెట్టారు. ఆ కుటుంబం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. కొన్నాళ్ల తరువాత ఆ ఇల్లు వారి బంధువుల చేతికి వెళ్లింది. వాళ్లు దానిలో నివసించే ధైర్యం చేయకపోవడంతో చాన్నాళ్లు ఖాళీగానే ఉండిపోయింది. కొన్నాళ్ల తర్వాత దాన్ని ఓ కుటుంబం కొనుక్కుంది. కానీ అక్కడ నివసించడం గగనమయ్యింది. రాత్రి అయితే చాలు... అరుపులు, కేకలు, ఏడుపులు, విచిత్ర ధ్వనులు, అడుగుల చప్పుళ్లు, ఆర్తనాదాలు... భయంతో అల్లాడిపోయారు. ఇంట్లో రకరకాల ఆకారాలు కనిపిస్తుంటే... ప్రాణాలు చిక్కబట్టుకుని గడిపారు. చివరకు ఆ ఇంటిని అమ్మేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత లలోరీ హౌస్ చాలామంది చేతికి వెళ్లింది. ఎవరూ అందులో నివసించలేకపోయారు. అందుకే డేవిస్ ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటానంటే అమ్మేశారు. కానీ జడుసుకున్న డేవిస్ కూడా దాన్ని మరొకరికి అమ్మి ఊరొదిలిపోయాడు. ఇప్పుడు లలోరీ హౌస్‌ను అత్యాధునికమైన అపార్ట్‌మెంట్‌గా తీర్చిదిద్దారు. పలువురు నివసిస్తున్నారు. కానీ డెల్ఫైన్ చేతిలో చనిపోయినవారి ఆత్మలు ఇప్పటికీ అక్కడ తిరుగుతున్నాయనే అంటున్నారు. అదే నిజమైతే... అక్కడ ఎలా నివసించగలుగుతున్నారు? దెయ్యాలు వారినేమీ చేయవని ధైర్యమా? లేక అసలు ఏమీ లేకపోయినా ఉన్నాయని ఫీలవుతున్నారా? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి డెల్ఫైన్ అద్భుతమైన సౌందర్యరాశి. ఆమె కూతుళ్లు కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నారేమో... వారిని చూసిన కళ్లు రెప్ప వేయడం మర్చిపోయేవి. వాళ్లు ఏదైనా ఫంక్షన్‌కు వస్తే... ఇక అందరి కళ్లూ వాళ్ల మీదే.