బొమ్మలతో మనం మాట్లాడితే పర్వాలేదు. అవే బొమ్మలు మనతో మాట్లాడితే భయపడక తప్పదు. ఇలా బొమ్మలతో భయపెట్టే సినిమాలు ఎన్నో! విచిత్రంగా ఓ సామాన్యుడు కూడా బొమ్మలతో భయపెట్టిస్తున్నాడు. నిజానికి అతని ఉద్దేశం వేరే అయినా స్థానికులు మాత్రం అతని ఇంటిలోపలికి కాదుకదా కనీసం కింద నుంచి బాల్కనీ వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. వెనెజులా రాజధాని కారకస్‌కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ ఎటాన్లస్ గోన్సాల్వెజ్‌కు ఓ డ్రైవర్‌తో మంచి స్నేహం ఉండేది. అతని కారులో ఎప్పుడూ బొమ్మలు ఉండేవి.
అది చూసిన గోన్సాల్వెజ్ కొడుకు తనకు కూడా ఇలా బొమ్మలను ఒక చోట సెట్ చేయమని కోరాడు. దీంతో, గోన్సాల్వెజ్ మూడేళ్లపాటు శ్రమించి బాల్కనీ నిండా బొమ్మలతో విచిత్రంగా నింపాడు. అయితే, ఆ బొమ్మల బాల్కనీ చూసిన కొడుకు సంతోషించినా, స్థానికులు మాత్రం కలవరపడుతున్నారు. అచ్చం దెయ్యం బొమ్మల్లా కనిపించే వాటిని చూసి, అతనేదో క్షుద్రపూజలు చేస్తున్నాడని, వాటిని తీసేయాల్సిందే అంటూ గొడవకు దిగారు. ఇలా కొన్ని నెలలపాటూ ఈ బొమ్మలపై గొడవ జరిగింది. ఏం చేసినా గోన్సాల్వెజ్ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానికులే సైలెంటైపోయారు. దీంతో, ప్రస్తుతం ఈ బొమ్మల బాల్కనీ అక్కడ ఓ ల్యాండ్ మార్క్‌గా మారింది. కొంతమంది కేవలం ఆ బాల్కనీని చూడ్డానికి అదేపనిగా వస్తున్నారు. ప్రస్తుతం అతను ఇంటిలోనికి అనుమతించడటం లేదు కానీ, కింద నుంచి చూసే అవకాశం మాత్రం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment