దెయ్యాలపై పరిశోధన | Research on devils | Sakshi
Sakshi News home page

దెయ్యాలపై పరిశోధన

Published Wed, May 14 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

దెయ్యాలపై పరిశోధన

దెయ్యాలపై పరిశోధన

శ్రీ మహేశ్వరి పరమేశ్వరా క్రియేషన్స్ పతాకంపై నజీరానూరి సమర్పణలో చాంద్ పాషా దర్శకత్వంలో బేగం, ఖాదర్‌బాబు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆనంద్‌కుమార్, రాజా, కార్తీక్, ‘రోషం’ బాలు, అనూష, స్వప్న ముఖ్య తారలు. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి దేవీప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, సాయి వెంకట్ క్లాప్ ఇచ్చారు. వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘దెయ్యాలున్నాయా?  అనే అంశంపై ముగ్గురు విద్యార్థులు పరిశోధన చేసి, బంగారు పతకం సాధిస్తారు. దెయ్యాలున్నాయని తేలిందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు. ఇది రొమాంటిక్ హారర్ మూవీ అని, 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. సన్నీ, కెమెరా: ఆనంద్ శ్రీరామ్, సహనిర్మాత: సల్మాన్‌ఖాన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement